AP Assembly – MLA Roja: జగన్‌పై ప్రశంసలు.. చంద్రబాబుపై పంచ్‌లు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా సందడే సందడి..

|

Nov 18, 2021 | 3:58 PM

AP Assembly - MLA Roja: అసెంబ్లీలో మహిళా సాధికారతపై జరిగిన చర్చలో సీఎం జగన్‌పై ఎమ్మెల్యే రోజా పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘నాకు దేవుడు ఇచ్చిన అన్న జగన్.. మా జగనన్న బంగారం..

AP Assembly - MLA Roja: జగన్‌పై ప్రశంసలు.. చంద్రబాబుపై పంచ్‌లు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా సందడే సందడి..
Mla Roja
Follow us on

AP Assembly – MLA Roja: అసెంబ్లీలో మహిళా సాధికారతపై జరిగిన చర్చలో సీఎం జగన్‌పై ఎమ్మెల్యే రోజా పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘నాకు దేవుడు ఇచ్చిన అన్న జగన్.. మా జగనన్న బంగారం.. మ‌హిళ‌ల‌కు ప‌ద‌వుల ప‌ట్టాభిషేకం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ అన్నదే.’’ అని కొనియాడారు. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగగా.. సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, అచ్చన్నాయుడిపై సెటైర్లు వేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి సాధించడంలో జగన్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 17 మంది ముఖ్యమంత్రులు పని చేశారు కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా జగన్‌ మాదిరిగా మహిళలలోకు రెండేళ్లలో లక్ష కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చలేదన్నారు.

‘సింహంతో ఆట.. జగన్‌తో వేట ఆడొద్దు అని చంద్రబాబును కోరుతున్నాను.’’ అని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్ వన్‌ సైడ్ అయ్యిందన్నారు. ‘‘కుప్పంలో చంద్రబాబును ఓడించి.. నా బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.’’ అంటూ రోజా సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఇంత చిన్న వయసులో జగన్‌కు ఇంత మంచి ఆలోచనలు ఎలా వస్తున్నాయో.. ఆంధ్రప్రదేశ్‌కు మరో 30 నుంచి 40 ఏళ్లు జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా.’’ అని ఆకాంక్షించారు. కుప్ప అడ్డా.. జగన్ అడ్డాగా మారిందని వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు, లోకేష్ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతారని ప్రశ్నించారు. చంద్రబాబును ఒకసారి అసెంబ్లీకి పిలవండి.. అయ‌న మొహం ఒక సారి చూడాల‌ని ఉంది.’’ అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రోజా.

Also read:

Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?.. ఆ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది

SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌…