Anupama Baby: ఐదు రోజుల్లోగా బాబును తీసుకురావాలి.. కేరళ చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆదేశం..
కేరళకు చెందిన అనుపమ ఎస్ఎఫ్ఐలో పని చేశారు. అదే ఎస్ఎఫ్ఐలో పని చేస్తున్న అజిత్ కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వారికి సంవత్సరం క్రితం బాబు పుట్టాడు...
కేరళకు చెందిన అనుపమ ఎస్ఎఫ్ఐలో పని చేశారు. అదే ఎస్ఎఫ్ఐలో పని చేస్తున్న అజిత్ కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వారికి సంవత్సరం క్రితం బాబు పుట్టాడు. అయితే బాబు నాలుగు రోజుల వయస్సులో అదృశ్యమయ్యాడు. దీనిపై ఆమె అప్పటి నుంచి ఆమె పోరాడుతుంది. ఆమె తండ్రి ఆమెకు తెలియకుండా శిశువును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులకు అప్పగించారని… దీనిపై ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.
తన బిడ్డను తన అనుమతి లేకుండా గత సంవత్సరంలో తన తండ్రి తీసుకెళ్లాడని అనుపమ ఆరోపించింది. రాజకీయంగా సంబంధం ఉన్న తన తండ్రితో CWC సభ్యులు చేతులు కలిపారని చెప్పింది. వారి సహకారంతోనే తన బిడ్డను ఇతరలకు అప్పగించారని ఆరోపించింది. గత కొన్ని రోజులుగా సీడబ్ల్యూసీ కార్యాలయం ఎదుట చిన్నారి తండ్రిదండ్రులు అనుపమ, అజిత్ కుమార్ ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ దంపతులకు దత్తత కోసం అప్పగించిన శిశువును తమ ముందు హాజరుపరచాలని కేరళ చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్(CWC) ఆదేశించింది. చిన్నారిని కేరళకు తీసుకొచ్చిన వెంటనే డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని సీడబ్ల్యూసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. అనుపమ ఈ ఉత్తర్వుతో సంతోషం వ్యక్తం చేసింది.
ఈ కేసులో అనుపమ తల్లిదండ్రులు, సోదరి, తండ్రి ఇద్దరు స్నేహితులు సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేరూర్‌క్కడ పోలీసులు తెలిపారు. గత నెల చివర్లో కుటుంబ న్యాయస్థానం ఆమె బిడ్డను దత్తత తీసుకునే ప్రక్రియపై స్టే విధించింది. సీల్డ్ కవర్‌లో వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. పిల్లవాడిని వదిలేశారా లేదా దత్తత ఇచ్చారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కుటుంబ న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది. ఇది నవంబర్ 20న విచారణకు రానుంది.
Read Also.. Supreme Court: ‘బాలిక దుస్తుల మీద తాకడం లైంగిక వేధింపే’.. బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు