Andhra Pradesh: లోకేష్‌ది ఐరెన్ లెగ్.. ఏం చేసినా ప్రమాదమే.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..

డైమండ్‌ అంటూ తనను కామెంట్‌ చేసిన టీడీపీ నేత నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. అతనే ఐరెన్ లెగ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Andhra Pradesh: లోకేష్‌ది ఐరెన్ లెగ్.. ఏం చేసినా ప్రమాదమే.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..
Andhra Pradesh Minister Roja
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 28, 2023 | 5:32 PM

డైమండ్‌ అంటూ తనను కామెంట్‌ చేసిన టీడీపీ నేత నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. అతనే ఐరెన్ లెగ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సైకో అయితే లోకేష్ ఐరెన్ లెగ్ సైకో అన్నారు రోజా. లోకేషే ఏం చేసినా ప్రమాదమేనని, ఈ ఐరెన్ లెగ్ రాష్టం అంతా తిరిగితే మా పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలు భయపడుతూ ఉన్నారని అన్నారు.

లోకేష్ మొదటి సారి గోదావరి పుష్కరాలకు వస్తే 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఆయిన వెంటనే వాళ్ళ బాబు చంద్రబాబుకు ఓటుకు నోట్ నోటీసులు వచ్చాయన్నారు. యువ గళం పోస్టర్ రిలీజ్ చేసిన రోజే కందుకూరు లో 8 మంది చనిపోయారనీ, ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే తారక రత్న కు గుండె పోటు వచ్చిందని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. తారక రత్నకు అంత సీరియస్‌గా ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా.. వైసీపీపై ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందిన సైకో లోకేష్ అంటూ విరుచుకు పడ్డారు. జీ వో ను జియో అంటూ, పాలన ను పానల ఆంటూ ప్రశాంతత ను ప్రశాంత్ అత్త అంటూ పులకేశీ లా తయారయ్యాడు లోకేష్ అంటూ మంత్రి రోజా సెటైర్ లు వేశారు.

మీడియాతో మంత్రి రోజా..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..