ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆ మంత్రి గారికి కోపం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలపై అంతెత్తు లేచారు. ఏందయ్యా మీ బాధ.. మీకేనా బాధలు మాకు లేవా? అంటూ కన్నెర్ర జేశారు. అంతేకాదండోయ్.. కార్యకర్తలంటే ఇలానే ఉంటారా..? బాధలు అదరికీ ఉంటాయి, సమయం సందర్భం ఉండక్కర్లేదా.. యూజ్‌లెస్ ఫెలో అంటూ.. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అంటూ తీవ్ర స్వరంతో అన్నారు. దాంతో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తల ముఖం మాడిపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి? ఎవరిని అన్నారు? ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఎక్కడ జరిగింది? ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం..
విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆ సమయంలో అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. ఎస్‌కోట టౌన్ అధ్యక్షుడు రెహమాన్ ఆయన్ను కలిశారు. స్థానిక పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతుందంటూ ఫైర్ అయ్యారు. పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అంటూ మండిపడ్డారు. బొత్స కామెంట్స్ తో ఆవాక్కయ్యారు కార్యకర్తలు. మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇలాగేనా మాట్లాడేదంటూ పార్టీ కేడర్ గుర్రుగా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..