Krishna District: పచ్చని చేల మధ్య ముక్కుపుటాలు అదిరే దుర్గంధం.. ఏంటా అని వెతక్కా షాక్..
అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పొలాల్లో రైతులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ టైమ్‌లో భయంకరమైన స్మెల్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏంటా ఆరాతీస్తే.. డెడ్‌బాడీ బయటపడింది. సీన్ చూసి షాకయ్యారంతా. ఇంతకీ హతుడెవరు..? హంతకులెవరు?
Andhra Pradesh: చెరువు గట్టు సమీపంలో చల్లని గాలి సేద తీరుతామని వచ్చిన వారికి దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోయాయి. ఎప్పుడు లేనివిధంగా శునకాలు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాయి. నో డౌట్.. సమ్‌థింగ్ ఈజ్ దేర్ అంటూ అనుమానంతో ఖాకీలకు సమాచారమిచ్చారు. తీరా తవ్వి చూస్తే.. డెడ్‌బాడీ. పుచ్చకాయల శ్రీనివాస్ రెడ్డి. స్వస్థలం కృష్ణాజిల్లా తొట్లవల్లూరు మండలం(Thotlavalluru mandal) భద్రిరాజుపాలెం(Bhadrirajupalem). ఈనెల 20న ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన శ్రీనివాస్ తిరిగి ఇంటికి వెళ్లలేదు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుపై ఫిర్యాదు చేస్తుండగానే.. చెరువు గట్టు సమీపంలో శ్రీనివాస్‌రెడ్డి శవమై తేలాడు. ఎవరు చంపారో.. ఎందుకు చంపారో తెలియదు.. పక్కా ప్లాన్‌తో హత్య చేసి పూడ్చిపెట్టారు. అయితే దుర్వాసన రావడంతో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్‌గా తేలింది. దీంతో మిస్టరీ తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
మ్యాటర్ తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి కుటుంబసభ్యులు గన్నవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి శ్రీనివాస్‌ను తీసుకెళ్లారని.. ఆ తర్వాత అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించామంటున్నారు బాధిత బంధువులు. శ్రీనివాస్‌రెడ్డి గతంలో ఓ హత్య కేసు నిందితుడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే ఆ కేసుకి సంబంధించిన కుటుంబసభ్యులు పగతో రగిలిపోయి శ్రీనివాస్‌ను చంపేశారా.. హత్యకు హత్యే సమాధానంగా మట్టుబెట్టారా అన్న అనుమానాలు శ్రీనివాస్‌ది హత్యగా తేల్చారు పోలీసులు. మరి హంతకులెవరు.. ఏ కారణంగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టారన్నది అంతుపట్టడం లేదు. పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగుటీమ్‌లుగా విడిపోయి హంతకుల వేట ముమ్మరం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..