Andhra Pradesh: స్మశానంలో విగ్రహ ప్రతిష్టపై వివాదం.. తహసీల్దార్‌ కార్యాలయానికి చేరిన శివుడు

|

Jan 30, 2023 | 8:46 AM

ఓవైపు విగ్రహం ఏర్పాటుచేసి తీరుతామని హిందువులు.. మరోవైపు వద్దంటూ శ్మశాన వాటిక వద్ద ఆందోళన చేస్తున్న క్రైస్తవులు.. ఇలా గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

Andhra Pradesh: స్మశానంలో విగ్రహ ప్రతిష్టపై వివాదం.. తహసీల్దార్‌ కార్యాలయానికి చేరిన శివుడు
Lord Shiva Statue Issue
Follow us on

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులో శివుని విగ్రహ ప్రతిష్ట వివాదంగా మారింది. హిందూ శ్మశాన వాటికలో శివుడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా క్రైస్తవులు అడ్డుపడ్డారు. తమ నివాసాలకు ఎదురుగా కనిపించేలా శివుడి విగ్రహం వద్దంటూ భైఠాయించారు. దీంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఓవైపు విగ్రహం ఏర్పాటుచేసి తీరుతామని హిందువులు.. మరోవైపు వద్దంటూ శ్మశాన వాటిక వద్ద ఆందోళన చేస్తున్న క్రైస్తవులు.. ఇలా గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలము కోటపాడు గ్రామంలో హిందూ శ్మశాన వాటిక చుట్టూ ప్రహరి నిర్మాణము చేసుకొని అందులో శివుని విగ్రహము ప్రతిష్టించేందుకు హిందువులు ప్రయత్నించగా కోటపాడు గ్రామ దళిత సంఘాలు ఆందోళనకు దిగారు. ఎస్సీ పేటకు ఎదురుగా శివుని విగ్రహం ఉంటే అరిష్టం కలుగుతుందని దళితులు అభ్యంతరం చేస్తున్నారు. గొడవ పెద్దది కావడంతో తహసీల్దార్‌ ఇరువురి పెద్దలతో మాట్లాడి ప్రస్తుతానికి విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయించారు.

అదే సమయంలో గ్రామ పెద్దలతో కలిసి పీస్ కమిటీ ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు తహసీల్దార్‌. అప్పటివరకు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో రంగంపేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో శివుని విగ్రహాన్ని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఉంచారు. కాగా దీనికి నిరసనగాఛలో కోటపాడు కి పిలుపునిచ్చాయి విశ్వ హిందు పరిషత్, భజరంగ్ దళ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..