AP Election Results: వార్‌ వన్‌ సైడ్‌.. ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభంజనం.. నియోజకవర్గాల వారీగా అధిక్యం ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం దిశగా వెళ్తోంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది.

AP Election Results: వార్‌ వన్‌ సైడ్‌.. ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభంజనం.. నియోజకవర్గాల వారీగా అధిక్యం ఇదే!
Nda

Updated on: Jun 04, 2024 | 1:15 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం దిశగా వెళ్తోంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ ఏపీ ప్రజాతీర్పు స్పష్టం కనిపిస్తోంది. పలుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లెక్కింపు కేంద్రాల నుంచి ఇంటిముఖం పడుతున్నారు. ఇక ఇప్పటి వరకు అయా నియోజకవర్గాల్లో ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం..

ప్రస్తుతం 144చోట్ల టీడీపీ పోటీ చేసింది. ఇందులో 132 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన, 20 నియోజకవర్గాల్లో లీడ్‌‌లో కొనసాగుతోంది. పాలకొండలో జనసేన, వైసీపీ మధ్య హోరాహోరీ నెలకొంది. ఇక 10 చోట్ల బీజేపీ పోటీ చేస్తే, 7 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 175 స్థానాల్లో పోటీచేసి 17చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే 16 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. 3చోట్ల బీజేపీ, రెండు చోట్ల జనసేన ఆధిక్యంలో ఉంది. ఇక కేవలం నాలుగు ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్‌ కొనసాగుతోంది.

ఇక నియోజకవర్గాల వారీ లీడ్ చూస్తే…

లోక్‌సభః

అనకాపల్లి ఎంపీ – బీజేపీ సీఎం రమేష్‌ లీడ్‌ (6వ రౌండ్‌) 62వేలు
మచిలీపట్నం – జనసేన బాలశౌరి లీడ్‌ (5893 ఓట్ల లీడ్‌)
నరసరావుపేట – టీడీపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్‌
బాపట్ల – టీడీపీ టి.కృష్ణప్రసాద్‌ లీడ్‌
ఒంగోలు – టీడీపీ మాగుంట శ్రీనివాసులు లీడ్‌
కర్నూల్‌ – టీడీపీ పంచలింగాల నాగరాజు లీడ్‌
హిందూపూర్‌ – టీడీపీ బీకే పార్థసారథి లీడ్‌ (6 రౌండ్లు) 11902 లీడ్
ఏలూరు – టీడీపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ లీడ్‌
అమలాపురం ఎంపీ – టీడీపీ హరీష్‌ లీడ్‌
అరకు ఎంపీ – బీజేపీ కొత్తపల్లి గీత లీడ్‌ (70)
విశాఖ ఎంపీ – భరత్‌ టీడీపీ లీడ్‌
కాకినాడ ఎంపీ – జనసేన లీడ్‌
శ్రీకాకుళం ఎంపీ – టీడీపీ లీడ్‌ (రామ్మోహన్‌ నాయుడు
రాజమండ్రి ఎంపీ – పురందరేశ్వరి 1973 ఓట్లతో లీడ్
నెల్లూరు ఎంపీ – వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి లీడ్‌
నరసాపురం ఎంపీ – బీజేపీ శ్రీనివాస వర్మ లీడ్‌
గుంటూరు ఎంపీ – టీడీపీ లీడ్‌ పెమ్మసాని
రాజంపేట ఎంపీ – వైసీపీ మిథున్‌ రెడ్డి లీడింగ్‌ (2 రౌండ్లు) 9021 ఓట్లు
విజయవాడ ఎంపీ – కేశినేని చిన్నీ లీడింగ్‌
చిత్తూరు ఎంపీ – టీడీపీ డి.ప్రసాదరావు లీడ్‌
తిరుపతి ఎంపీ – వైసీపీ గురుమూర్తి లీడ్‌
అనంతపురం ఎంపీ -టీడీపీ లీడ్‌
కడప పార్లమెంట్‌ – వైసీపీ లీడింగ్‌

అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ఆధిక్యంః

విజయనగరం – టీడీపీ లీడింగ్‌ (అప్పలనాయుడు)
రాజమండ్రి రూరల్‌ – బుచ్చయ్య చౌదరి లీడ్‌
పూతలపట్టు – టీడీపీ లీడింగ్‌
గంగాధరనెల్లూరు – టీడీపీ లీడింగ్‌
నెల్లూరు సిటీ – టీడీపీ లీడింగ్‌
కుప్పం – చంద్రబాబు లీడింగ్‌ 893
గజపతినగరం – టీడీపీ లీడింగ్‌
పిఠాపురం – జనసేన లీడింగ్‌
మైదుకూరు – టీడీపీ లీడింగ్‌ (1000 లీడ్‌)
మండపేట – టీడీపీ లీడింగ్‌
కొవ్వూరు – టీడీపీ లీడింగ్‌
డోన్‌ – టీడీపీ లీడింగ్‌
జగ్గంపేట – టీడీపీ లీడింగ్‌
కోవూరు – టీడీపీ లీడింగ్‌
రామచంద్రాపురం – టీడీపీ లీడింగ్‌
ముమ్మిడివరం – టీడీపీ లీడింగ్‌
తెనాలి – జనసేన నాదెండ్ల మనోహర్‌ లీడింగ్‌ (2120)
చిత్తూరు అసెంబ్లీ – టీడీపీ లీడింగ్‌ (1311)
ఉండి – రఘురామకృష్ణరాజు లీడింగ్‌
రాజమండ్రి సిటీ – టీడీపీ లీడ్‌ (ఆదిరెడ్డి శ్రీనివాస్‌)
ఒంగోలు అసెంబ్లీ – టీడీపీ లీడింగ్‌
పొన్నూరు – టీడీపీ లీడ్‌ (2170)
పి.గన్నవరం – జనసేన లీడ్‌
హిందూపురం – టీడీపీ బాలకృష్ణ లీడ్‌
భీమవరం – జనసేన లీడ్‌
విజయవాడ వెస్ట్‌ -బీజేపీ లీడ్
తిరువూరు – టీడీపీ లీడ్‌ (3982) (4వ రౌండ్‌)
రేపల్లె -టీడీపీ లీడ్‌
దెందులూరు – టీడీపీ లీడ్‌ (చింతమనేని)
తాడేపల్లిగూడెం – జనసేన లీడ్‌
అనపర్తి – వైసీపీ లీడ్‌
గుంటూరు ఈస్ట్‌ – టీడీపీ లీడ్‌ (మహ్మద్‌ నజీర్‌)
గుడివాడ – టీడీపీ లీడ్‌
మైలవరం – టీడీపీ లీడ్‌
నగరి – టీడీపీ లీడ్‌
మంగళగిరి – టీడీపీ నారాలోకేష్‌ లీడ్‌
జమ్మలమడుగు – బీజేపీ లీడ్‌ (ఆదినారాయణ రెడ్డి)
నందిగామ – టీడీపీ లీడ్‌
వినుకొండ – టీడీపీ లీడ్‌ (జీవీ ఆంజనేయులు)
బాపట్ల – టీడీపీ లీడ్‌ (నరేంద్రవర్మ) 1394
నెల్లూరు రూరల్‌ – టీడీపీ లీడ్‌
మాచర్ల – టీడీపీ లీడ్‌ (జూలకంటి బ్రహ్మారెడ్డి)
విశాఖ ఈస్ట్‌ – టీడీపీ లీడ్‌ (5298) (4వ రౌండ్‌)
ఎచ్చెర్ల – బీజేపీ లీడ్‌
అనకాపల్లి – జనసేన లీడ్‌ (కొణతాల రామకృష్ణ)
విజయనగరం – టీడీపీ లీడ్‌ (అదితి గజపతిరాజు) 3728 (3వ రౌండ్‌)
ఆళ్లగడ్డ – టీడీపీ లీడ్‌
చోడవరం – టీడీపీ లీడ్‌
సత్తెనపల్లి – టీడీపీ లీడ్‌ (కన్నా లక్ష్మీనారాయణ ) 860
గురజాల – టీడీపీ లీడ్‌ (యరపతినేని) 4472
ఉంగుటూరు – జనసేన లీడ్‌
నరసరావుపేట – టీడీపీ (చదలవాడ అరవింద్‌) 1800
ఆముదాలవలస – టీడీపీ లీడ్‌ (కూన రవికుమార్‌ 1255)
సత్తెనపల్లి – టీడీపీ లీడ్‌ (కన్నా లక్ష్మీనారాయణ)
కందుకూరు – టీడీపీ లీడ్‌ (ఇంటూరు నాగేశ్వర్రావు)
పలమనేరు – టీడీపీ లీడ్‌ (అమర్నాథ్‌రెడ్డి)2042
విశాఖ నార్త్‌ – బీజేపీ లీడ్‌ (విష్ణుకుమార్‌ రాజు) 1623
మాడుగుల – టీడీపీ లీడ్‌ (బండారు సత్యనారాయణ మూర్తి) 2800
అద్దంకి – టీడీపీ లీడ్‌ (గొట్టిపాటి రవి) 1834
గన్నవరం – టీడీపీ (వెనిగళ్ల రాము) 2960
గూడూరు – టీడీపీ లీడ్‌ ()
చంద్రగిరి – టీడీపీ లీడ్‌ (పులివర్తి నాని)
చీపురుపల్లి – టీడీపీ లీడ్‌ (కళావెంకట్రావు 920)
తణుకు – టీడీపీ లీడ్‌ (అరిమిల్లి రాధాకృష్ణ)
ఏలూరు – టీడీపీ లీడ్‌ (బడేటి రాధాకృష్ణ)
టెక్కలి – టీడీపీ లీడ్‌ (అచ్చెన్నాయుడు )
తుని – టీడీపీ లీడ్‌
అవనిగడ్డ – జనసేన లీడ్‌ 3243
పామర్రు -టీడీపీ లీడ్‌ 1500
వెంకటగిరి – టీడీపీ లీడ్‌
జగ్గయ్యపేట – టీడీపీ లీడ్‌ 1000
అమలాపురం – టీడీపీ లీడ్‌
కొండెపి – టీడీపీ లీడ్‌ (డోలా బాలా వీరాంజనేయస్వామి)
మార్కాపురం – టీడీపీ లీడ్‌ (కందుల నారాయణరెడ్డి) 1029
పర్చూరు – టీడీపీ లీడ్‌ (ఏలూరి సాంబశివరావు) 2335
భీమిలి – టీడీపీ లీడ్‌ (గంట శ్రీనివాసరావు) 2194
యలమంచిలి – జనసేన లీడ్‌ (సుంకర విజయ్‌ కుమార్‌)
విజయవాడ సెంట్రల్‌ – టీడీపీ లీడ్‌ (బోండా ఉమ 2699)
పలాస – టీడీపీ లీడ్‌ (గౌతు శిరీష) 2388
గుంతకల్లు – టీడీపీ లీడ్‌
కోడూరు – జనసేన లీడ్‌
నర్సన్నపేట – టీడీపీ లీడ్‌
చిలకలూరిపేట – టీడీపీ లీడ్‌
ఇచ్చాపురం – టీడీపీ లీడింగ్‌
వేమూరు – టీడీపీ లీడింగ్‌
చీరాల – టీడీపీ లీడింగ్‌ (కొండయ్య)
ప్రత్తిపాడు – టీడీపీ లీడ్‌
విశాఖ వెస్ట్‌ – టీడీపీ లీడ్‌
విశాఖ సౌత్‌ – జనసేన లీడ్‌
పాడేరు – వైసీపీ లీడ్‌ (1510)
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర 1917 ఓట్ల లీడ్‌
సర్వేపల్లిలో – సోమిరెడ్డి లీడ్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..