Andhra Pradesh: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడైనా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా .. ఆయనది ఎప్పుడూ సింప్లిసిటీయే. ప్రజలతో కలిసిపోవడం.. కుటుంబ సభ్యుడిలా వాళ్ల కష్టాలు తెలుసుకోవడం ఆయన స్టైల్. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు జిల్లాలు జలమయం అయ్యాయి. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. ఎంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటన ప్రారంభించారు. దీనికి సంబంధించి రెండు రోజుల షెడ్యూల్‌లో భాగంగా.. తొలిరోజు కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు.
అయితే, ఈ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆసక్తికర సన్నివేశం ఒకటి జరిగింది. వరద బాధితులతో మాట్లాడుతుండగా ఓ వినతిపత్రంపై సీఎం జగన్ సంతకం చేయాల్సి వచ్చింది. అక్కడున్న ఓ అధికారి ఆయన చేతికి పెన్ అందించగా అది పనిచేయలేదు. దాంతో ఆ పెన్ క్యాప్ బిగించి తిరిగి అధికారి జేబులో పెట్టారు సీఎం జగన్. ఆ తర్వాత అధికారి జేబులో ఉన్న మరో పెన్నును ఆయనే స్వయంగా తీసుకుని సంతకం చేసిచ్చారు. ఈ ఇన్సిడెంట్ అక్కడున్న వారందనీ ఆకట్టుకుంది. ఈ సీన్ చూసిన అక్కడున్న జనం జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!