Andhra Pradesh: గుట్కా ప్రకంపనలతో హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్‌.. అధికార, ప్రతిపక్ష నేతల పరస్పర ఆరోపణలు

|

Oct 29, 2022 | 8:48 AM

గుట్కా దందాలో ఎమ్మెల్యే గోపిరెడ్డి హస్తముందన్నారు నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్‌ అరవింద్‌బాబు. దందాకు పెట్లూరివారిపాలెంకు చెందిన వైసీపీ నేత నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, వైసీపీ నేతల ఫోన్‌ కాల్‌ లిస్టు పరిశీలిస్తే గుట్కా వ్యవహారం బయటపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: గుట్కా ప్రకంపనలతో హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్‌.. అధికార, ప్రతిపక్ష నేతల పరస్పర ఆరోపణలు
Gutka Danda
Follow us on

పల్నాడు జిల్లాలో అధికార వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య గుట్కా వార్‌ నడుస్తోంది. గుట్కా వ్యాపారానికి మీరంటే మీరే కేంద్రం బిందువంటూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరి సవాళ్ల వరకు వెళ్లింది. గుట్కా దందాలో ఎమ్మెల్యే గోపిరెడ్డి హస్తముందన్నారు నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్‌ అరవింద్‌బాబు. దందాకు పెట్లూరివారిపాలెంకు చెందిన వైసీపీ నేత నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, వైసీపీ నేతల ఫోన్‌ కాల్‌ లిస్టు పరిశీలిస్తే గుట్కా వ్యవహారం బయటపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఇలాంటి దందాలను మానుకోవాలని హెచ్చరించారు. మరోవైపు అరవింద్‌ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్టయ్యారు ఎమ్మెల్యే గోపి. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ప్రతిసవాల్‌ విసిరారు. తనతోపాటు.. తన అనుచరుల ఫోన్‌ నంబర్లను డీజీపీకి ఇవ్వడానికి సిద్ధమన్నారు. దందాలో తమ ప్రమేయం ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చాలెంజ్‌ చేశారు. ఇలా రుపార్టీల నేతల సవాల్‌తో  పల్నాడు జిల్లా పాలిటిక్స్‌ హీటెక్కిస్తున్నాయి.

కాగా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో జోరుగా గుట్కాదందా సాగుతుంది. పోలీసులు దాడులు చేస్తున్నా, తనిఖీలు చేస్తున్నా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఈనేపథ్యంలోనే గుట్కా దందా వెనక మీరంటూ మీరు ఉన్నారంటూ అధికార, ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు గుట్కా దందాలో ఎవరి హస్తమెంత అన్నది విచారణ జరిగితే తప్ప తెలిసేలా లేదంటున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..