ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండగా సమీర్ శర్మ ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. ఓ పక్కకు ఒరిగిపోయారు. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సమీర్ శర్మకు మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది.
ఇటీవల సమీర్‌శర్మ ఇదేవిధంగా అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. హార్ట్ సర్జరీ అనంతరం సీఎస్ సమీర్ శర్మ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
సెక్రటేరియట్లో రివ్యూ చేస్తుండగా.. సమీర్ శర్మ అస్వస్థతకు గురి కావడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. సీఎస్ శమీర్ శర్మ ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..