AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాయలసీమ రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బంపర్‌ ఆఫర్‌

రాయలసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా సీమ రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Andhra Pradesh: రాయలసీమ రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బంపర్‌ ఆఫర్‌
Ap Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Sep 28, 2022 | 4:44 PM

Share

రాయలసీమ రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. సోలార్‌, విండ్‌ విద్యుత్‌ ఉత్పాదన కోసం భూములిచ్చేందుకు అంగీకరించిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల లీజుని చెల్లిస్తామని ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వమే ఈ భూములు లీజుకు తీసుకుని కంపెనీలకు ఇస్తుందని వెల్లడించారు. నంద్యాల జిల్లా కలవటాల దగ్గర రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను ప్రారంభించిన సీఎం రైతులను భూములిచ్చేందుకు ఒప్పించాలని అధికారులకు సూచించారు. సోలార్‌, విండ్‌ విద్యుత్‌ ఉత్పాదనకు రైతులు సహకరించాలని, గ్రీన్‌కో ప్రాజెక్టులకు రైతులు సుముఖంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వమే రైతుల నుంచి భూమి తీసుకొని విద్యుత్‌ తయారీ సంస్థలకు ఇస్తుందని, రైతులతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వం వార్షిక లీజు కింద 30 వేల రూపాయలు చెల్లిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి మూడేళ్ళకోసారి లీజుని ఐదు శాతం పెంచుతామని ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారు.

ఒక ప్రాంతంలో కనీసం 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా భూములు సేకరించాలన్నారు జగన్‌. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన రైతుల నుంచి భూములను సేకరించాలని, రైతులను ఒప్పించడంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తెలిపారు సీఎం జగన్‌.   కనీసం 2 వేల ఎకరాలు ఓ క్లస్టర్‌గా ఉండాలన్నారు. గ్రీన్ కో ప్రాజెక్ట్‌లకు అన్నదాతలు సహకరించాలన్నారు.  ఒక పరిశ్రమ రావడం వల్ల ఆ ప్రాంతం ఎంతో డెవలప్ అవుతుందని ..స్థానిక యువతకు జాబ్స్ వస్తాయన్నారు.

గ్రోత్‌ రేటులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉందన్నారు సీఎం జగన్. రానున్న 4 ఏళ్లలో 20 వేల జాబ్స్ రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. పరిశ్రమలు రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇండస్ట్రీలు వస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?