AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..! కప్ప – ముత్యం నీతి కథ

Frog and Pearl Moral Story: జీవితంలో ఆశ మంచిదే కానీ అత్యాశ మాత్రం నష్టానికే దారి తీస్తుంది. కప్ప, హంస, వేటగాడి మధ్య జరిగే ఈ ఆసక్తికరమైన నీతి కథ సమయస్ఫూర్తి, నిజమైన స్నేహం, దురాశ వల్ల కలిగే పరిణామాలను చక్కగా వివరిస్తూ ప్రతి ఒక్కరికీ విలువైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. అత్యాశతో వేటగాడు ఎలా నష్టపోయాడో చూడండి..

Moral Story: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..! కప్ప – ముత్యం నీతి కథ
Frog And Pearl Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jul 15, 2026 | 6:38 PM

Share

నీతి కథలు మనకు నైతిక విలువలతో పాటు సమయస్ఫూర్తిని కూడా నేర్పుతాయి. ఏది చెడు.. ఏది మంచో మనకు అర్థమయ్యేలా చేస్తాయి. జీవితంలో ఆశ ఉండటం సహజం. కానీ అదే అత్యాశగా మారితే చేతిలో ఉన్నవి కూడా జారిపోతాయి. ఈ విషయాన్ని అద్భుతంగా తెలియజేసే ఒక చక్కని నీతి కథల్లో కప్ప – ముత్యం కథ ఒకటి. అలాగే ఆపదలో సమయస్ఫూర్తి ఎంత గొప్ప ఆయుధమో కూడా ఈ కథ మనకు నేర్పుతుంది.

కథ

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చిన్న కొలను ఉండేది. ఆ కొలనులో ఒక కప్ప ఆనందంగా జీవించేది. ఒకరోజు అక్కడికి ఒక హంస వచ్చింది. మొదట పరిచయమైన వీరిద్దరూ కొద్దికాలంలోనే ప్రాణస్నేహితులయ్యారు. ప్రతి రోజు కొలను ఒడ్డున కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. ఒకరోజు కప్ప తామరాకుపై తేలుతూ ఉండగా, హంస ఒడ్డున నిలబడి ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.

అంతలో అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. హంసను చూసిన వెంటనే దాన్ని పట్టుకుని అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. వెంటనే తన వలను హంసపైకి విసిరాడు. ఒక్కసారిగా వలలో చిక్కుకున్న హంస భయంతో విలవిలలాడింది. తన ప్రాణం కాపాడమని కప్ప వైపు ఆశగా చూసింది.

ఇవి కూడా చదవండి

స్నేహితురాలు ప్రమాదంలో పడటాన్ని చూసిన కప్ప వెంటనే వేటగాడి దగ్గరకు వెళ్లింది. “దయచేసి నా స్నేహితురాలిని విడిచిపెట్టు” అని వేడుకుంది. కానీ వేటగాడు “దీన్ని అమ్మితే నాకు మంచి డబ్బు వస్తుంది. నేను వదలను” అని చెప్పాడు. కొద్దిసేపు ఆలోచించిన కప్ప, “నీకు కావాల్సింది డబ్బే కదా… ఒక నిమిషం ఆగు” అని చెప్పి కొలనులోకి మునిగింది. కొంతసేపటి తర్వాత ఒక అందమైన విలువైన ముత్యాన్ని తీసుకొచ్చి వేటగాడికి ఇచ్చింది. “ఈ ముత్యాన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు” అని కోరింది. ముత్యం విలువ తెలిసిన వేటగాడు ఎంతో సంతోషపడి హంసను విడుదల చేశాడు.

భార్య మాటతో పెరిగిన అత్యాశ

ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని వేటగాడు తన భార్యకు చెప్పాడు. అది విన్న ఆమె “ఒక ముత్యం ఇచ్చిందంటే ఆ కప్ప దగ్గర ఇంకా ఎన్నో ముత్యాలు ఉండి ఉంటాయి. వెంటనే వెళ్లి అన్నీ తెచ్చేయి” అని దురాశతో చెప్పింది. ఆ మాటలు విన్న వేటగాడిలో అత్యాశ మరింత పెరిగింది. వెంటనే కొలను దగ్గరకు వెళ్లిన వేటగాడు కప్పను బెదిరిస్తూ “ఏయ్.. నీ దగ్గర ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయ్. లేకపోతే హంసను మళ్లీ పట్టుకుంటా” అని అన్నాడు.

వేటగాడి దురాశను గమనించిన కప్ప ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది. “సరే… ముందు నీ చేతిలో ఉన్న ముత్యాన్ని ఒక్కసారి నాకు ఇవ్వు. దాన్ని చూసి అచ్చం అలాంటి ముత్యాలనే లోపల నుంచి తీసుకొస్తాను” అని చెప్పింది. వేటగాడు అమాయకంగా నమ్మి తన చేతిలో ఉన్న ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు. ముత్యం అందుకున్న వెంటనే కప్ప దాన్ని నోట కరుచుకుని నీటిలోకి దూకేసింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నీటిలో నుంచి గట్టిగా ఇలా అరిచింది..”నా స్నేహితురాలు హంస అప్పుడే సురక్షితమైన చోటుకు వెళ్లిపోయింది. ఇక మేమిద్దరం నీకు దొరకం. అత్యాశతో నీ చేతిలో ఉన్న ముత్యాన్ని కూడా పోగొట్టుకున్నావు.” వేటగాడు తన తప్పు తెలుసుకుని నెత్తినోరు బాదుకుంటూ తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు.

నీతి

ఈ కథ మనకు రెండు గొప్ప జీవిత పాఠాలను నేర్పుతుంది. అత్యాశ మనిషిని నష్టాల బాట పట్టిస్తుంది. ఆపద సమయంలో సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉంటే ఎంతటి సమస్యనైనా అధిగమించవచ్చు.

అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. జీవితంలో లభించిన దానితో సంతృప్తి చెందడం, అవసరానికి మించి దురాశ చూపకపోవడం విజయానికి మొదటి మెట్టు అని ఈ నీతి కథ మనకు గుర్తు చేస్తుంది.

Follow Us
కప్ప – ముత్యం నీతి కథ: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..!
కప్ప – ముత్యం నీతి కథ: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..!
మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?
మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?
ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!
ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!