AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: నిజమైన స్నేహితుడు ఎవరు? జీవితాంతం గుర్తుండిపోయే నీతి కథ

స్నేహం జీవితంలో అత్యంత విలువైన బంధం. నిజమైన స్నేహం అంటే కేవలం సంతోషాలను పంచుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో అండగా నిలవడం కూడా. ఈ హృదయాన్ని హత్తుకునే ఈ నీతి కథ క్షమాగుణం, కృతజ్ఞత, నిజమైన స్నేహం విలువను చక్కగా వివరిస్తుంది. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.

Moral Story: నిజమైన స్నేహితుడు ఎవరు? జీవితాంతం గుర్తుండిపోయే నీతి కథ
True Friend Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jul 07, 2026 | 3:35 PM

Share

స్నేహం..రక్తం పంచుకోకుండానే ప్రకృతి మనకు ఇచ్చే అత్యంత పవిత్రమైన బంధం ఇది. బంధువులను ఎంచుకునే అవకాశం మనకు ఉండదు కానీ, మనకు నచ్చిన మనస్తత్వం ఉన్న వ్యక్తిని స్నేహితుడిగా ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. అందుకే “మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం” అంటారు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. సుఖంలో తోడుగా ఉండేవారు చాలా మంది ఉంటారు. కానీ, కష్టాల్లో అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. అలాంటి నిజమైన స్నేహం విలువను గుండెకు హత్తుకునేలా వివరించే ఒక నీతి కథ ఇది.

కథ

ఒక గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరోజు సెలవు కావడంతో ఇద్దరూ కలిసి ఊరి బయటకు షికారుకు వెళ్లారు. దారిలో ఒక చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాదన మొదలైంది. ఆ వాదన క్రమంగా గొడవగా మారింది. కోపాన్ని అదుపు చేసుకోలేక ఒక స్నేహితుడు మరొకరి చెంపపై బలంగా కొట్టాడు. దెబ్బ తిన్న స్నేహితుడు బాధపడినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పక్కనే ఉన్న ఇసుకపై ఇలా రాశాడు…”ఈ రోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు”. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి ముందుకు నడిచారు.

కొంత దూరం వెళ్లిన తర్వాత ఇద్దరికీ దాహం వేసింది. సమీపంలోని నీటి మడుగు వద్దకు వెళ్లారు. దెబ్బ తిన్న స్నేహితుడు ముందుగా నీటిలోకి దిగాడు. కానీ అక్కడ ప్రమాదకరమైన ఊబి ఉండటంతో అందులో చిక్కుకుని మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రాణభయంతో గట్టిగా సహాయం కోసం కేకలు వేశాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపటి క్రితమే గొడవ జరిగినా.. మరో స్నేహితుడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే తన దుస్తులను ఉపయోగించి మునిగిపోతున్న స్నేహితుడికి అందించి, అతడిని ఊబి నుంచి బయటకు లాగి ప్రాణాలను కాపాడాడు.

ఇవి కూడా చదవండి

కొంతసేపటి తర్వాత ప్రమాదం నుంచి కోలుకున్న స్నేహితుడు సమీపంలోని ఒక పెద్ద బండరాయిపై ఇలా చెక్కాడు…”ఈ రోజు నా స్నేహితుడు నా ప్రాణాలను కాపాడాడు”. ఇది చూసిన మొదటి స్నేహితుడు ఆశ్చర్యపడి అడిగాడు…”నిన్ను కొట్టినప్పుడు ఇసుకపై రాశావు… ఇప్పుడు బండరాయిపై ఎందుకు చెక్కావు?”

అప్పుడు అతను చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు – “ఎవరైనా మనకు బాధ కలిగిస్తే దాన్ని ఇసుకపై రాయాలి. ఎందుకంటే క్షమ అనే గాలి వీచినప్పుడు ఆ బాధ చెరిగిపోతుంది. కానీ ఎవరైనా మనకు చేసిన ఉపకారాన్ని బండరాయిపై చెక్కాలి. ఎందుకంటే కాలం మారినా ఆ కృతజ్ఞత ఎప్పటికీ చెరిగిపోకూడదు.”

నీతి

ఈ కథ మనకు ఓ గొప్ప నీతి సందేశం ఇస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. చిన్న చిన్న అపార్థాలు, గొడవలు సహజమే. కానీ వాటిని మనసులో పెట్టుకుని సంబంధాలను పాడు చేసుకోవడం కంటే క్షమించడం గొప్ప గుణం. అదే సమయంలో మనకు కష్టకాలంలో అండగా నిలిచిన వారి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. కృతజ్ఞతను జీవితాంతం గుర్తుంచుకోవడం మంచి వ్యక్తుల లక్షణం. నిజమైన స్నేహం మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది. కష్టాల్లో తోడుగా నిలిచేవారే అసలైన స్నేహితులు.

Also Read: బడాయి కప్ప కథ.. ఇతరులతో పోల్చుకోవడం ప్రమాదకరం..!

Follow Us