AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivation: జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు..! మ్యాథ్స్ ప్రొఫసర్ నేర్పిన విజయ పాఠం

Personal Growth: ఇది నా వల్ల కాదు.. అనే భయమే చాలా సందర్భాల్లో మన విజయానికి అతిపెద్ద అడ్డంకి. నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. రన్నింగ్ ట్రాక్‌పై ఒక విద్యార్థికి మ్యాథ్స్ ప్రొఫసర్ నేర్పిన జీవిత పాఠం ఇదే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఈ స్ఫూర్తిదాయక కథను మస్ట్‌గా చదివేయండి..మీ దోస్త్‌లకు షేర్ చేయండి.

Motivation: జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు..! మ్యాథ్స్ ప్రొఫసర్ నేర్పిన విజయ పాఠం
Nothing Is Impossible Motivational StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jul 03, 2026 | 12:29 PM

Share

నా వల్ల కాదు..ఇది అసాధ్యం.. నేను చేయలేను.. అనే మాటలు మనలో చాలామంది నిత్యం ఉపయోగించే పదాలు. కానీ నిజంగా అసాధ్యం అనేది ఉంటుందా? లేక మన భయమే దాన్ని అసాధ్యంగా కనిపించేలా చేస్తుందా? ఒక విద్యార్థి జీవితంలో జరిగిన చిన్న సంఘటన ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెబుతుంది.

ఒక విద్యార్థి ఇంటర్ ముగించుకుని కాలేజీలో చేరాడు. డిగ్రీలో అయితే చేరాడుకానీ.. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే అతనికి విపరీతమైన భయం. గణితం గురించి ఆలోచించినా ఆందోళన చెందేవాడు. తాను మ్యాథ్స్‌లో పాస్ కాలేననే భయం అతనిలో బలంగా ఉండేది. అలాంటి సమయంలో అతనికి ఒక అనుభవజ్ఞుడైన మ్యాథ్స్ ప్రొఫెసర్ ఆ విద్యార్థికి ఓ వరంలా దొరికారు. విద్యార్థుల బలహీనతలను బలాలుగా మార్చడంలో నేర్పరిగా ఆయనకు మంచి పేరుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆయన మొదటి రోజే మ్యాథ్స్ పాఠాలు మొదలుపెట్టలేదు. బదులుగా విద్యార్థిని కాలేజీ ప్లే గ్రౌండ్‌కు తీసుకెళ్లారు.

రన్నింగ్ ట్రాక్‌పై మొదలైన అసలు పాఠం

ప్రొఫెసర్ ఆ విద్యార్థిని హర్డిల్స్ ఉన్న రన్నింగ్ ట్రాక్‌పై పరిగెత్తమన్నారు. మొదటి ప్రయత్నంలోనే ఒక అడ్డంకిని దాటబోయి బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. ప్రొఫెసర్ ఏమీ అనలేదు.. మరుసటి రోజు మళ్లీ అదే సాధన చేయించారు. ఇలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ ప్రాక్టీస్ కొనసాగింది. ఐదో రోజు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదట భయపెట్టిన ప్రతి హర్డిల్‌ను ఎంతో సులభంగా దాటుకుంటూ ఆ విద్యార్థి పరుగును విజయవంతంగా పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రొఫెసర్ అడిగిన ఒక్క ప్రశ్న

పరుగు పూర్తయ్యాక ప్రొఫెసర్ చిరునవ్వుతో ఆ విద్యార్థిని – మొదటి రోజు ఎందుకు పడిపోయావు? అని అడిగారు. భయపడ్డాను సార్.. నాకు అలవాటు లేదని ఆ విద్యార్థి చెప్పాడు. అప్పుడు ప్రొఫసర్ మరో ప్రశ్న అడిగారు – మరి ఈరోజు ఎలా సాధించగలిగావు?.. దానికి ఇప్పుడు ఆ అడ్డంకులు అంత పెద్దవిగా కనిపించడం లేదు. నిరంతర సాధన చేస్తే ఏ పనినైనా చేయగలననే నమ్మకం వచ్చిందని విద్యార్థి సమాధానం ఇచ్చాడు.

అప్పుడు ప్రొఫెసర్ అసలు విషయాన్ని చెప్పారు. రన్నింగ్ ట్రాక్‌లో అడ్డంకులను ఎలా అధిగమించావో, అలాగే మ్యాథ్స్‌లో కూడా సాధన చేస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలవు. భయం కాదు… ప్రాక్టీసే విజయానికి నిజమైన మార్గం అని చెప్పారు. ఆ ఒక్క పాఠంతో విద్యార్థి గణితం మీదున్న భయాన్ని పూర్తిగా జయించాడు.

జీవితానికి వర్తించే గొప్ప సందేశం

ఈ కథలోని అసలు సందేశం ఒక్కటే. మనం కొన్ని పనులు మొదలు పెట్టకముందే అది అసాధ్యమని నిర్ణయించేస్తాం. కానీ ఆ పని ప్రారంభించి, ప్రతిరోజూ కొద్దికొద్దిగా సాధన చేస్తే అదే పని ఒకరోజు చాలా సులభంగా అనిపిస్తుంది. ‘నా వల్ల కాదు..’ అనే ఆలోచనే మన ఎదుగుదలకు అడ్డంకి. ‘ఒక్కసారి ప్రయత్నిద్దాం..’ అనే ఆలోచనతో ప్రయత్నిస్తే విజయం మనకు మరింత దగ్గరవుతుంది. మన జీవితంలో కూడా ఇలాంటివే ఎన్నో ఉదాహరణలు అనుభవంలో చూసే ఉంటాం. అంటే మన సామర్థ్యం మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. పరిస్థితులు వచ్చినప్పుడు మనలోని అసలైన శక్తి బయటపడుతుంది.

జీవితంలో అసాధ్యం అనేది చాలా సందర్భాల్లో నిజమైన అడ్డంకి కాదు. అది మన మనసులో ఏర్పడిన భయం మాత్రమే. ఆ భయాన్ని జయించే మార్గం ఒక్కటే—నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం, పట్టుదల. చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగితే, ఈరోజు అసాధ్యంగా కనిపించిన లక్ష్యం రేపు మీ విజయగాథగా మారుతుంది. ఎందుకంటే మనసు పెడితే మనిషి సాధించలేనిది దాదాపు ఏదీ లేదు.

Also Read: ఈ ఒక్క అలవాటు చాలు.. విజయం వైపు మీ ప్రయాణం మొదలైనట్టే!

Follow Us