AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం

Golden Axe Moral Story: చిన్నారుల్లో నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం, మంచి విలువలను పెంపొందించడంలో నీతి కథలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి ప్రసిద్ధ కథల్లో ‘కట్టెలు కొట్టేవాడు - దేవత కథ’ ఒకటి. నిజాయితీకి ఎల్లప్పుడూ తగిన ప్రతిఫలం లభిస్తుందనే గొప్ప జీవిత పాఠాన్ని పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా తెలియజేస్తుంది.

Moral Story: నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం
Golden Axe Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jun 24, 2026 | 6:30 PM

Share

చిన్నారులకు నీతి కథలు చెప్పడం వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. వారిని సరైన మార్గంలో నడిపించేందుకు ఈ నీతి కథలు ప్రేరణగా నిలుస్తాయి.  నిజాయితీ, కష్టపడి పనిచేయడం, ఇతరుల పట్ల మంచిగా ఉండడం వంటి విలువలను చిన్న వయసులోనే అలవర్చేందుకు నీతి కథలు చక్కటి మార్గం. పిల్లలకు నైతిక విలువలు, నిజాయితీని బోధించే ప్రసిద్ధ కథల్లో ఒకటే ‘కట్టెలు కొట్టేవాడు – దేవత కథ’. నిజాయితీతో జీవిస్తే తప్పక ప్రతిఫలం దక్కుతుందని ఈ కథ గుండెకు హత్తుకునేలా వివరిస్తుంది.

కథ

చాలా కాలం క్రితం ఓ చిన్న గ్రామంలో ఒక కట్టెలు కొట్టేవాడు జీవించేవాడు. కుటుంబాన్ని పోషించేందుకు అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు. ప్రతిరోజూ సమీపంలోని అడవికి వెళ్లి చెట్లు నరికి, వాటిని గ్రామానికి తీసుకొచ్చి అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించేవాడు. పెద్దగా సంపాదన లేకపోయినా, తన జీవితంతో సంతృప్తిగా ఉండేవాడు.

ఒక రోజు నది ఒడ్డున చెట్టు నరుకుతుండగా, అతని చేతిలోని ఇనుప గొడ్డలి జారి నదిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉండటంతో దానిని తిరిగి తెచ్చుకునే మార్గం కనిపించలేదు. ఆ గొడ్డలి అతని జీవనోపాధి కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చివరికి అతను దేవతను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు.

ఇవి కూడా చదవండి

అతని ప్రార్థనకు స్పందించిన దేవత ప్రత్యక్షమై, సమస్య ఏమిటని అడిగింది. విషయం తెలుసుకున్న దేవత నదిలోకి చేయి పెట్టి ముందుగా ఒక వెండి గొడ్డలిని తీసి..‘ఇది నీదేనా?’ అని అడిగింది. కట్టెలు కొట్టేవాడు నిజాయితీగా.. ‘కాదు, అది నాది కాదు’ అని చెప్పాడు.

మళ్లీ దేవత బంగారు గొడ్డలిని తీసి.. ‘ఇది నీదేనా?’ అని అడిగింది. అతను మళ్లీ.. ‘కాదు. అది కూడా నాది కాదు. బంగారు గొడ్డలితో నేను పని చేయలేను’ అని సమాధానమిచ్చాడు.

చివరగా దేవత అతని ఇనుప గొడ్డలిని బయటకు తీసి చూపించగా, కట్టెలు కొట్టేవాడు ఎంతో ఆనందంతో ‘అవును, ఇదే నాది’ అని చెప్పాడు.

అతని నిజాయితీకి ముగ్ధురాలైన దేవత.. ఇనుప గొడ్డలితో పాటు వెండి, బంగారు గొడ్డళ్లను కూడా బహుమతిగా ఇచ్చింది.

నీతి

ఈ నీతి కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. తాత్కాలిక లాభాల కోసం అబద్ధాలు చెప్పకుండా, ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీ, మంచితనం, కష్టపడే తత్వం ఉన్నవారికి జీవితంలో ఎప్పటికైనా తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. నిజాయితీకి ఎప్పుడూ మంచి ప్రతిఫలం లభిస్తుంది.

Also Read: మూడు చేపల కథ.. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ నష్టం తథ్యం..!

Follow Us
నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం
నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్