Andhra Pradesh: ఏడో తరగతి విద్యార్ధి కిడ్నాప్‌ డ్రామా.. స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టం లేకనే..

| Edited By: Srilakshmi C

Sep 15, 2023 | 1:10 PM

చిన్న వయసులో పెద్ద పెద్ద పని చేశాడో బాలుడు. స్కూలుకు వెళ్లలేక కిడ్నాప్ డ్రామా ఆడి దొరికిపోయాడు. ఎవరు కిడ్నాప్ చేయకపోయినా కిడ్నాప్ చేసినట్లు నాటకమాడి స్కూల్ కి డుమ్మా కొట్టే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. పాఠశాలకు వెళ్ళకూడదని కిడ్నాప్ డ్రామా ఆడాడు. బడికి వెళ్లేందుకు ఇష్టం లేకనే విద్యార్థి కిడ్నాప్ నాటకమాడాడు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి..

Andhra Pradesh: ఏడో తరగతి విద్యార్ధి కిడ్నాప్‌ డ్రామా.. స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టం లేకనే..
School Student Plays Kidnapping Drama
Follow us on

కర్నూల్‌, సెప్టెంబర్‌ 15: చిన్న వయసులో పెద్ద పెద్ద పని చేశాడో బాలుడు. స్కూలుకు వెళ్లలేక కిడ్నాప్ డ్రామా ఆడి దొరికిపోయాడు. ఎవరు కిడ్నాప్ చేయకపోయినా కిడ్నాప్ చేసినట్లు నాటకమాడి స్కూల్ కి డుమ్మా కొట్టే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. పాఠశాలకు వెళ్ళకూడదని కిడ్నాప్ డ్రామా ఆడాడు. బడికి వెళ్లేందుకు ఇష్టం లేకనే విద్యార్థి కిడ్నాప్ నాటకమాడాడు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి పంపారు.

ఆదోని పట్టణం కుమ్మరివీధికి చెందిన దంపతుల కుమారుడు ఓ ప్రయివేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం బాలుడికి తల్లి రూ.20 ఇచ్చి పాల ప్యాకెట్‌ తీసుకురావాలని చెప్పింది. ఆ బాలుడు అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా ఆడుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్లాడు. తిరిగి సాయంత్రం అమరావతినగర్ లో ఉన్న అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. ఉదయం వెళ్లిన బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. సాయంత్రం బాలుడి అమ్మమ్మ ఇంటి నుంచి ఫోన్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

గ్రౌండ్‌కు వెళ్లి ఆడుకున్నానని చెబితే కొడతారని బాలుడు కిడ్నాప్ నాటకం ఆడాడు. పాల ప్యాకెట్ తీసుకుంటుండగా ఎవరో ఆటోలో గోనెసంచెలో తనను తీసుకొని పోయి సాయంత్రం వరకు తిప్పి అమరావతినగర్ లో విడిచిపెట్టారని తెలిపారు. అక్కడి నుంచి అమ్మమ్మ ఇంటికి చేరుకున్నానని కట్టుకథ అల్లాడు. సోషల్ మీడియాలో ఈ కథనం హల్చల్ చేసింది. వెంటనే గురువారం ఉదయం ఆ బాలుడిని వారి తల్లిదండ్రులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించి సీఐ విక్రమసింహా విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల్లో ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడో పరిశీలించారు. అయితే ఎక్కడా ఆటోలో ఆ బాలుడు వెళ్లినట్లు సీసీకెమెరాలో రికార్డు కాలేదు. బాలుడికి సీఐ కౌన్సెలింగ్ ఇవ్వగా తాను బడికి వెళ్లేందుకు ఇష్టం లేక కిడ్నాప్ అయినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లను అలవాటు చేయవద్దన్నారు. ఎక్కువగా చదువుపై ఒత్తిడి కూడా తీసుకురావొద్దని, వారికి ఇష్టమైనది ఏదో తెలుసుకుని ప్రోత్సహించాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.