CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో ప్రత్యేక భేటీ.. ఆ ఆంశాలపైనే ప్రధాన చర్చ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న సీఎం.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న సీఎం.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ వెళ్తారు. రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. జనపథ్ 1లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు సమాచారం. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాలసిన నిధులు, పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు శీతాకాలం కాబట్టి పోలవరం నిధులు విడుదల చేస్తే వర్షాకాలం వచ్చే నాటికి చాలా వరకు పనులు పూర్తి చేయవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. జీ20 సమావేశాల పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ – చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తరువాత ఇప్పుడు మరోసారి సీఎం జగన్ ప్రధానితో భేటీ కావటం కీలకంగా మారుతోంది. ఇప్పటికే పలు సార్లు నివేదించిన పోలవరం సవరించిన అంచనాలు ప్రధాన అజెండాగా ఉంది. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన ప్రధానితో చేయించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జీ20 సన్నాహక సదస్సులు ఏపీలో నిర్వహణపైనా చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు.. ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం కొనసాగుతోంది. ప్రధానితో జనసేన అధినేత పవన్ విశాఖ లో భేటీ తరువాత టీడీపీతో సంబంధాలపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రధానితో సీఎం సమావేశంలో ఏపీలో తాజా రాజకీయాల పై చర్చకు వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా జగన్ వచ్చే ఎన్నికలకు తన ప్రణాళిలను అమలు చేయనున్నారు. దీంతో, ఈ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.