AP Rains: ఏపీకి చల్లటి కబురు.. ఉరుములు, మెరుపులు.. జోరున వడగండ్లు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఏపీలో ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. ఉక్కపోత, ఎండ వేడితో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వాతావరణ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.. ఓ సారి లుక్కేయండి మరి

నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడినది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపోఆవరణములో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి.
—————————————-
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములుతో కూడిన జల్లులు లేదా వడగండ్ల ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, వడగండ్లలతో కూడిన ఈదురుగాలులు గంటకు 40-50కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 – 50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 – 50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 – 50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.