AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!

Agarbatti Manufacturing Scam: సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను స్థాపించి, అమాయకులను టార్గెట్ చేసి వివిధ ప్రొడక్ట్స్ ను ప్యాకింగ్ చేయడం ద్వారా మీకు నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తామని,ఈ ప్రొడక్ట్స్ విలువకు తగ్గట్టుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని, కోట్లాది రూపాయలను అమాయకులతో కట్టించి పత్తా లేకుండా లేకుండా పోయారు..

AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!
Agarbatti Manufacturing Scam
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 7:24 PM

Share

Agarbatti Manufacturing Scam: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులను పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించడం ఎలా అంటూ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాలో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాళ్ల కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కిరాణా షాప్ లో అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ, ఇంటి వద్ద నుండే వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు అంటూ అమాయకులకు వివిధ సోషల్ మీడియాల ద్వారా ఎరవేసి కోట్లాది రూపాయలు దోచేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. వరదా కృష్ణమోహన్, గేదెల సంధ్యారాణి లు సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను స్థాపించి, అమాయకులను టార్గెట్ చేసి వివిధ ప్రొడక్ట్స్ ను ప్యాకింగ్ చేయడం ద్వారా మీకు నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తామని,ఈ ప్రొడక్ట్స్ విలువకు తగ్గట్టుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని, కోట్లాది రూపాయలను అమాయకులతో కట్టించి పత్తా లేకుండా లేకుండా పోయారు.

పథకం ప్రకారం ముందుగానే ఊహించి.. ప్రతినెలా క్రమం తప్పకుండా అనుకున్న సమయానికి వీరికి జీతాలు చెల్లిస్తూ, నమ్మకం కుదిరాక వీరుతోనే మరి కొంతమందిని ఇదే ఊబిలోకి లాగి వారి దగ్గర నుండి లక్షలాది రూపాయలను కాజేసి, కోట్లు పోగేసిన తర్వాత పారిపోవడంతో.. ఇదే కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్లు, వారిని నమ్ముకున్న డబ్బు కట్టిన వేలాదిమంది అమాయకులు రోడ్డున పడ్డారు. వీరి మోసానికి బలైపోయిన బ్రాంచ్ ల మేనేజర్లు, వీరిని నమ్మి మోసపోయిన మరి కొంతమంది రోడ్డున పడటంతో.. వీరు రాజమండ్రిలోని త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: Silver Price: మహిళలకు శుభవార్త.. ఏకంగా రూ.50 వేలు తగ్గిన వెండి ధర.. ఇంకా తగ్గుతుందా?

రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్ లు ఉండగా, మోసపోయిన వారు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నలుగురు బ్రాంచ్ మేనేజర్ ల ద్వారా పోగేసిన సొమ్ము మూడు కోట్ల 60 లక్షల రూపాయలు గా తేలింది. తాము మోసపోయామని అనుకున్న మేనేజర్లంతా రాజమండ్రిలోని సత్యసాయి ఎంటర్ప్రైజెస్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ నిలదీద్దామని వస్తే.. అప్పటికే మూట ముళ్ళు సద్దేశారు ఈ నయవంచకులు.

అయితే వరదా కృష్ణమోహన్, గేదెల సంధ్యారాణి చేసే మోసాలు ఒక రాజమండ్రి తో సరిపెట్టలేదు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క బ్రాంచ్ ని పెడుతూ క్రమక్రమంగా అమాయకులను మోసం చేసి కోట్లాది రూపాయలను దోచేశారని బాధితులు చెబుతున్నారు. మాకు న్యాయం చేయాలంటూ అటు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడంలేదని, మరోపక్క రాజకీయ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. ప్రయోజనం లేదని బాధితులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. మోసగాన్ని పట్టుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు బాధితులు.

మరిన్ని ఏపీ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కొత్త అవతారంలో రామ్.. తొలి సినిమాతోనే డేంజరస్ ఎక్స్‌పరిమెంట్
కొత్త అవతారంలో రామ్.. తొలి సినిమాతోనే డేంజరస్ ఎక్స్‌పరిమెంట్
టాప్ హీరోయిన్లకు టెన్షన్ పెడుతున్న కొత్త బ్యూటీస్..
టాప్ హీరోయిన్లకు టెన్షన్ పెడుతున్న కొత్త బ్యూటీస్..
పీలోని వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.20 వేలు జమ..
పీలోని వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.20 వేలు జమ..
పర్సెంటేజ్ పంచాయితీ కొలిక్కి వచ్చినట్లేనా
పర్సెంటేజ్ పంచాయితీ కొలిక్కి వచ్చినట్లేనా
ఇండస్ట్రీలోనే తోపు నటి.. కెరీర్ పీక్స్ లో ఉండగానే..
ఇండస్ట్రీలోనే తోపు నటి.. కెరీర్ పీక్స్ లో ఉండగానే..
పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్,..సీన్ కట్ చేస్తే..
పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్,..సీన్ కట్ చేస్తే..
ఇది రైలా..? పట్టాలపై వెళ్లే విమానమా.. బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ ..
ఇది రైలా..? పట్టాలపై వెళ్లే విమానమా.. బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ ..
కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్
కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్
జిల్లేడు మొక్క గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన నిజం! శుభమా..
జిల్లేడు మొక్క గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన నిజం! శుభమా..
నైటీ వేయలేనంటూ ఆ హీరో నా 'మెంటల్ కృష్ణ' సినిమాను రిజెక్ట్ చేశాడు
నైటీ వేయలేనంటూ ఆ హీరో నా 'మెంటల్ కృష్ణ' సినిమాను రిజెక్ట్ చేశాడు