AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భవిష్యత్‌కు దారి చూపే మహా విద్యా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026

TV9 & KAB Education Expo 2026 మే 22 నుంచి 24 వరకు HITEX Exhibition Centre లో నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా అవకాశాలు, కెరీర్ ఎంపికలపై మార్గదర్శనం అందించనుంది.

భవిష్యత్‌కు దారి చూపే మహా విద్యా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026
Tv9 & Kab Education Expo 20
Rajashekher G
|

Updated on: May 18, 2026 | 4:37 PM

Share

TV9 and KAB Education Expo 2026: హైదరాబాద్‌లో ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ఉన్నత విద్యా ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 మే 22 నుంచి మే 24, 2026 వరకు ప్రతిష్టాత్మకమైన HITEX Exhibition Centre లో ఘనంగా నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించి, సరైన కెరీర్ నిర్ణయాలు తీసుకునేందుకు మార్గనిర్దేశం చేయనుంది.

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న TV9 ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఎక్స్‌పోను బెంగళూరు, అహ్మదాబాద్, హుబ్బಳ್ಳಿ, వడోదరా, రాజ్‌కోట్, సూరత్, శివమొగ్గ, పుణే, హైదరాబాద్, విజయవాడ, కోల్‌కతా, విశాఖపట్నం వంటి 12 ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి KAB Educational Consultants మద్దతు అందిస్తోంది. విద్యార్థుల కెరీర్ గైడెన్స్, అడ్మిషన్ సలహాలు, సరైన కోర్సుల ఎంపికలో అనుభవజ్ఞులైన సంస్థగా KAB Educational Consultants ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఈ ఎక్స్‌పోలో విద్యార్థులకు విభిన్న ఉన్నత విద్యా కోర్సులపై పూర్తి సమాచారం అందించబడుతుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ వంటి అనేక కోర్సులతో పాటు విదేశీ విద్య అవకాశాలపై కూడా నిపుణుల మార్గదర్శకత్వం లభిస్తుంది.

ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి ఉచిత నిపుణుల కౌన్సెలింగ్. విద్యార్థుల ఆసక్తులు, అర్హతలు, పరీక్ష ఫలితాల ఆధారంగా సరైన కోర్సులు, కాలేజీల ఎంపికపై నిపుణులు ప్రత్యక్షంగా సలహాలు అందిస్తారు. అలాగే TSEAPCET, ECET, JoSAA, NEET వంటి ప్రధాన ప్రవేశ పరీక్షల వెబ్ కౌన్సెలింగ్‌పై ప్రత్యేక మార్గదర్శకత్వం కూడా ఇవ్వబడుతుంది.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో కలిసి ఈ ఎక్స్‌పోను సందర్శించేందుకు ఆహ్వానించబడ్డారు. వివిధ విద్యాసంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి అడ్మిషన్ ప్రక్రియ, కోర్సు వివరాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై స్పష్టత పొందవచ్చు. ఒకే వేదికపై సమగ్ర విద్యా సమాచారం అందుబాటులో ఉండటం ఈ ఎక్స్‌పో ప్రత్యేకత.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు తమ భవిష్యత్ విద్యా ప్రణాళికలను రూపొందించుకునే కీలక సమయంలో ఈ ఎక్స్‌పో ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ప్రముఖ విద్యాసంస్థలు, నిపుణుల సలహాలు, కెరీర్ మార్గదర్శకత్వం.. all under one roof.. అనే భావనతో ఈ కార్యక్రమం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికగా నిలవనుంది.

TV9 Network, KAB Educational Consultants ఈ ఎక్స్‌పోను కేవలం విద్య ప్రదర్శనగా కాకుండా, ప్రతి విద్యార్థి జీవితాన్ని మార్చే కెరీర్ మార్గదర్శక వేదికగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దారి చూపే ఈ కార్యక్రమాన్ని గత కొంత కాలంగా టీవీ9 నెట్‌వర్క్ కొనసాగిస్తుండటం గమనార్హం.

  • వేదిక: HITEX Exhibition Centre, హైటెక్ సిటీ, హైదరాబాద్.
  • తేదీలు: మే 22–24, 2026
  • సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు.

Follow Us