జీడితోటలో కలకలం.. అక్కడి సీన్‌ చూసి భయంతో కూలీలు పరుగులు..

Eluru: మవరపుకోట మండలం వాలిసుగ్రీవుల గట్టు సమీపంలో జీడి తోటలో పది అడుగుల పింజర పాము కాసేపు హల్ చల్ చేసింది. జీడిగింజలు ఏరుతున్న కూలీలకు ఒక్కసారిగా పది అడుగులకు పైగా ఉన్న పింజర పాము కనిపించడంతో హడలిపోయారు

జీడితోటలో కలకలం.. అక్కడి సీన్‌ చూసి భయంతో కూలీలు పరుగులు..

Updated on: May 17, 2022 | 4:01 PM

Eluru: సాధారణంగా పామును చూస్తేనే మనం హడలిపోతాం. ఎక్కడైనా అవి కనిపిస్తే భయంతో దూరంగా వెళ్లిపోతాం. అలాంటిది ఒక్కసారిగా పది అడుగుల పాము ఎదురుపడితే.. వారి భయాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి పరిస్థితే ఎదురైంది ఏలూరు జిల్లా కూలీలకు. కామవరపుకోట మండలం వాలిసుగ్రీవుల గట్టు సమీపంలో జీడి తోటలో పది అడుగుల పింజర పాము కాసేపు హల్ చల్ చేసింది. జీడిగింజలు ఏరుతున్న కూలీలకు ఒక్కసారిగా పది అడుగులకు పైగా ఉన్న పింజర పాము కనిపించడంతో హడలిపోయారు. భయంతో కేకలు వేశారు. వీరి అరుపులకు సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. కూలీలతో కలిసి ఆ పది అడుగుల పామును హతమార్చారు.

కాగా ఇటీవల పాములు, కొండచిలువలు అడవులను దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇళ్లలోకి, ఆలయాల్లోకి వెళతూ ప్రజలను భయపెడుతున్నాయి. కాగా ఈ ప్రాంతంలోనూ తరచూ చిన్న పాములు కనిపిస్తాయని అయితే పది అడుగుల పాము కనిపించడం ఇదే మొదటిసారని కామవరపు కూట కూలీలు చెబుతున్నారు. ఒక్కసారిగా అంత పెద్ద పాము కనిపించేసరికి హడలిపోయామన్నారు. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వారు వచ్చి పామును హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:
Shikhar Dhawan Acting Debut: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘గబ్బర్’.. షూటింగ్‌ కూడా పూర్తి.. విడుదల ఎప్పుడంటే?

World Hypertension Day 2022: హైబీపీ పేషెంట్లు మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!

Rupee Falling: కనిష్ఠాలను తాకుతున్న రూపాయి.. కారణాలేంటి.. లాభం ఎవరికి.. పూర్తి వివరాలు..