Watch Video: టన్ను బరువున్న పురాతన బీరువా.. దొరికిన తాళాలు.. వజ్ర, వైఢూర్యాలు ఉంటాయా?!
కర్నూలు జిల్లాలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా లభ్యమైన ఇనుప బీరువా తాళాలు కూడా దొరికాయి. ఆ తాళాలతో మరికాసేపట్లో బీరువాను ఓపెన్ చేయనున్నారు. తవ్వకాల్లో లభ్యమైన ఈ పురాతన బీరువా దాదాపు టన్ను బరువు ఉంది. దాంతో అందులో ఏముందా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కర్నూలు జిల్లాలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా లభ్యమైన ఇనుప బీరువా తాళాలు కూడా దొరికాయి. ఆ తాళాలతో మరికాసేపట్లో బీరువాను ఓపెన్ చేయనున్నారు. తవ్వకాల్లో లభ్యమైన ఈ పురాతన బీరువా దాదాపు టన్ను బరువు ఉంది. దాంతో అందులో ఏముందా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీరువాలో ఏముందో చూసేందుకు స్థానికులతో పాటు, చుట్టుపక్కన గ్రామాల ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలోని దేవనకొండ మండలం, కరివేముల గ్రామంలో సాకలి నరసింహులు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఇనుప బీరువా ప్రత్యక్షమైంది. ఈ బీరువాలో బంగారం ఉందంటూ ప్రచారం సాగింది. బీరువా భారీ బరువు ఉండడంతో దానిని తేరవడానికి గ్రామస్తుల నానాతంటాలు పడ్డారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బీరువాను తెరవడానికి ఎవరికీ అనుమతులు లేవంటూ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఇంటి యజమానులు షాక్ అయ్యారు.
కరివేముల గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డికి చెందిన ఇంటిని.. చాకలి నరసింహులు అనే వ్యక్తి రూ.9.30 లక్షలు వెచ్చించి సంవత్సరం క్రితం కొనుగోలు చేశాడు. ఆ స్థలంలోనే నరసింహులు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బీరువా బయటపడింది. దాంతో అది తమకే చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు. బీరువా తమ పెద్దలది కావున తమకే చెందుతుందని అంటున్నారు. మరోవైపు ఇది తన స్థలం అని, బీరువాలో ఉన్నది తనకే చెందుతుందంటూ నరసింహులు అంటున్నాడు.
బీరువాలో ఏముందో తెలియక ముందే రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వస్తున్నాయని అంటున్నారు గ్రామస్తులు. కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చిన తరువాతే బీరువాను తెరుస్తాం అంటున్నారు రెవెన్యూ అధికారులు. బీరువాలో ఏముందో మరికాసేపట్లో తేలనుంది. బీరువాలో ఏముందో చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. గతంలో కరివేముల గ్రామంలో ఇంటి పునాదులు తీసే సమయంలో బంగారు నాణాలు దొరికిన సందర్భాలు ఉండడంతో ఈ బీరువాలో ఏముందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరికాసేపు ఎదురు చూడాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
