Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాల కోసం మహిళ ఒంటరి పోరాటం..ఆక్రమణను అడ్డుకోవాలంటూ 45 రోజులుగా..

ప్రభుత్వాలు మారిన పాఠశాలల పరిస్థితి మాత్రం అరకొరగానే నిర్మాణాలు చేపట్టి ఎక్కడికక్కడ నిలుపుదల చేసారనీ, 10 సంవత్సరాల క్రితం 600 మందితో తరగతులు నిర్వహణ జరుగుతుండగా, ఇప్పటి పరిస్థితి 450 కి దిగజారిందనీ.... ఒక ప్రధానోపాధ్యాయులు 20 మంది టీచర్లతో అభివృద్ధి పథంలో ఉండవలసిన స్కూలు ఇప్పుడు ఆక్రమణలకు గురై మందుబాబులకు, వ్యభిచారానికి అడ్డగా మారింది పోతున్నారు

Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాల కోసం మహిళ ఒంటరి పోరాటం..ఆక్రమణను అడ్డుకోవాలంటూ 45 రోజులుగా..
Anaparthi School Siege

Edited By: Jyothi Gadda

Updated on: May 29, 2025 | 1:31 PM

కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని స్థానిక గ్రామస్తురాలు వల్లూరి శ్రీవాణి 40 రోజులుగా రిలే నిరాహార దీక్షల చేస్తూనే ఉంది…1960లో ప్రభుత్వం సుమారు 9 ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడంతో గ్రామస్తుల సహకారం ప్రభుత్వంతో ఒక పాఠశాల అప్పట్లో నిర్మించారు. అయితే, ప్రభుత్వాలు మారిన పాఠశాలల పరిస్థితి మాత్రం అరకొరగానే నిర్మాణాలు చేపట్టి ఎక్కడికక్కడ నిలుపుదల చేసారనీ, 10 సంవత్సరాల క్రితం 600 మందితో తరగతులు నిర్వహణ జరుగుతుండగా, ఇప్పటి పరిస్థితి 450 కి దిగజారిందనీ…. ఒక ప్రధానోపాధ్యాయులు 20 మంది టీచర్లతో అభివృద్ధి పథంలో ఉండవలసిన స్కూలు ఇప్పుడు ఆక్రమణలకు గురై మందుబాబులకు, వ్యభిచారానికి అడ్డగా మారింది పోతున్నారు శ్రీ వాణి అనే మహిళ..

ప్రభుత్వాలు మారినా గ్రామ పెద్దలు స్కూలు అభివృద్ధి కోసం పాటుపడకుండా పాఠశాల అభివృద్ధిని పక్కనపెట్టి సొంత ప్రయోజనాల కోసం లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు..కేశవరం సమీపంలో కోకో కోల పరిశ్రమ ఉండడంతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మించడానికి ముందుకు వచ్చినా.. పాలకులు మాత్రం ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు..స్కూలు ఆవరణలో ఆక్రమణలు చేసి బవంతులు నిర్మించుకున్న వారికి పక్కా గృహాలు మంజూరు చేసినా…ప్రహరీ కట్టేందుకు ఎల్లప్పుడూ అడ్డుపడుతూనే ఉంటున్నారని శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు…

స్కూలు ఆవరణలో నుండి రహదారులు ఏర్పాటు చేసుకుని అడ్డదిడ్డంగా మసులుతుంటే కాపలా దారుడు చెన్నయ్య ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. యువకులు మద్యం సేవించి పదే పదే  తనతో గొడవకు దిగుతున్నారని ఎంతంటే కాపలా కాయగలనని ఆవేదన వ్యక్తం చేశాడు…

ఇవి కూడా చదవండి

పోలీసులు అప్పుడప్పుడు వచ్చి తనిఖీలు చేసి వెళ్ళిపోతుంటారని, గ్రామస్తులు ప్రజా ప్రతి నిధులు అండతో యువకులు మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించడానికి అనువైన స్థలంగా మలుచుకుని వ్యవహారాలను నడిపిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ఈ పాఠశాల బాగు కోసం పోరాటం చేస్తున్న మహిళను స్థానిక అధికారులు పట్టించుకుంటారో లేదో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..