AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆటగదరా శివ.. పెళ్లికి వెళ్లి ఇంటికి బయలుదేరాడు.. అంతలోనే..

బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు.. అక్కడ ఆనందంగా గడిపాడు.. మొత్తం శుభకార్యం అయిపోయాక ఇంటికి తిరిగి వెళుతుండగా.. బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.. పెళ్ళికని వెళ్లిన వాడు తిరిగిరాని పరలోకానికి వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Andhra: ఆటగదరా శివ.. పెళ్లికి వెళ్లి ఇంటికి బయలుదేరాడు.. అంతలోనే..
Crime News
Nalluri Naresh
| Edited By: |

Updated on: Nov 24, 2025 | 7:34 PM

Share

బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు.. అక్కడ ఆనందంగా గడిపాడు.. మొత్తం శుభకార్యం అయిపోయాక ఇంటికి తిరిగి వెళుతుండగా.. బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.. పెళ్ళికని వెళ్లిన వాడు తిరిగిరాని పరలోకానికి వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి(36).. కళ్యాణదుర్గంలో తన బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళాడు. తిమ్మారెడ్డి బంధువులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొని.. భోజనం ముగించుకున్నాడు.. అనంతరం అలా కాసేపు వాకింగ్ చేసేందుకు రోడ్డు మీదకు రాగానే.. వేగంగా వచ్చిన బైక్ ఢీకొని తిమ్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

తిమ్మారెడ్డితో పాటు అలా నడుచుకుంటూ వెళుతున్న మరో ముగ్గురిని కూడా బైక్ ఢీకొట్టడంతో.. వారికి తీవ్రంగా గాయాలయ్యాయి.. తిమ్మారెడ్డికి బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు.. దీంతో ఒక్క క్షణంలోనే పెళ్లి ఇంట్లో ఆనందానికి బదులు ఆర్తనాదాలు వినిపించాయి.. పెళ్లి మండపంలో బంధువులతో సెల్ఫోన్లో దిగిన ఫోటోలతో తిరిగి వస్తాడు అనుకున్న భర్త.. శవపేటికలో తిరిగి రావడంతో.. తిమ్మారెడ్డి భార్య భారతిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు..

పెళ్లి ఇంట్లో బంధువులతో అప్పటివరకు సంతోషంగా ఉన్న తిమ్మారెడ్డి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య పిల్లలతోపాటు.. తల్లిదండ్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది… తిమ్మారెడ్డి అకాల మృతి నేపథ్యంలో.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.. భరోసా ఇచ్చారు. ఈ ఘటన విచారకరమని పేర్కొన్న ఎమ్మెల్యే.. సంతాపం తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us