Atreyapuram Putharekulu: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు.. త్వరలో అధికారిక ప్రకటన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం పూతరేకులకున్న డిమాండ్‌ అంతాఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆత్రేయపురం పూతరేకులకు త్వరలో భౌగోళిక గుర్తింపు దక్కనుంది..

Atreyapuram Putharekulu: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు.. త్వరలో అధికారిక ప్రకటన
Atreyapuram Putharekulu

Updated on: Apr 05, 2023 | 1:01 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం పూతరేకులకున్న డిమాండ్‌ అంతాఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆత్రేయపురం పూతరేకులకు త్వరలో భౌగోళిక గుర్తింపు దక్కనుంది. సర్దార్ కాటన్ పూతరేకుల సంఘంకు మరో నాలుగు నెలల్లో భౌగోళిక గుర్తింపు గెజిట్ నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలో దామోదర్ సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయాన్ని చెందిన మాకిరెడ్డి మనోజ్ ఆత్రెపురం పూతరేకుల సంఘం అధ్యక్షులు, సంఘ సభ్యులు కలెక్టర్‌ను కలిసి పూతరేకులకు సంబంధించి భౌగోళిక జనరల్ అందించారు. 400ల సంవత్సరాల చరిత్ర కలిగిన పూతరేకులకు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో ఆత్రేయపురం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.