అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు శంకుస్థాపన.. వీడియో ఇదిగో..
అమరావతి రాజధానిలో మరో మైలురాయి. తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ శంకుస్థాపన బుధవారం జరిగింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం.. నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నారా బ్రాహ్మిణి సహా.. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అమరావతి రాజధానిలో మరో మైలురాయి. తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ శంకుస్థాపన బుధవారం జరిగింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం.. నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నారా బ్రాహ్మిణి సహా.. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. 25 ఏళ్ల సేవా వారసత్వం కలిగిన బసవతారకం సంస్థ, ఇప్పుడు రాజధాని అమరావతి విస్తరణతో అడుగులు వేసింది. అధునాతన క్యాన్సర్ కేర్ సెంటర్‌తో పాటు రెండు దశల్లో రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనుంది.
రాజధానిలో నిర్మాణాల కొత్త ఊపు..
రాజధాని అమరావతిలో తొలి దశ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్జీలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస భవనాల నిర్మాణం వేగం. రూ.55 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభం కానున్న వాతావరణంలో, తుళ్లూరులో జరిగిన ఈ శంకుస్థాపన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
బసవతారకం ప్రాజెక్ట్‌పై ఫోకస్
21 ఎకరాల విస్తీర్ణం. రెండు దశల్లో అభివృద్ధి. సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధన, రోగి కేంద్రీకృత సంరక్షణ ప్రధాన లక్ష్యం. అత్యాధునిక వైద్య సాంకేతికత, బహుళ వైద్య విభాగాల సమన్వయంతో ప్రపంచ స్థాయిలో నిర్మించనున్నారు.
మొదటి దశ – ముఖ్యాంశాలు
ఆసుపత్రిలో 500 పడకల సామర్థ్యం
రూ.750 కోట్ల పెట్టుబడి
అధునాతన రేడియేషన్, శస్త్రచికిత్స సాంకేతికతలు
నివారణ నుంచి పునరావాసం వరకు సమగ్ర చికిత్స
2028 నాటికి ప్రారంభం..
రెండో దశ – విస్తరణ
అదనంగా 500 పడకలు – మొత్తం 1,000 పడకల సామర్థ్యం
ప్రత్యేక విభాగాలు, పరిశోధనా కేంద్రాలు
సంక్లిష్ట కేసులకు రిఫరల్ హబ్
సేవా వారసత్వం
దేశవ్యాప్తంగా వేలాది క్యాన్సర్ రోగులకు సేవలందించిన బసవతారకం ఆసుపత్రి, అమరావతి ప్రాజెక్ట్‌తో వెనుకబడిన ప్రాంతాలకు ప్రపంచ స్థాయి చికిత్స అందించనుంది.
దాతలకు ధన్యవాదాలు
రాజధాని అమరావతిలో నూతన రీసెర్చ్ సెంటర్ తో పాటు అధునాతన క్యాన్సర్ హాస్పిటల్ ప్రాజెక్ట్ సాధ్యమైనందుకు దాతలు, భాగస్వాములు, శ్రేయోభిలాషులకు బసవతారకం ట్రస్ట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
