జగన్ అనే నేను..ఇక సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విశ్వాసం, విధేయతతో కూడిన పాలనను అందిస్తానని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జగన్‌కు గవర్నర్ అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభా వేదికపై మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి […]

జగన్ అనే నేను..ఇక సీఎం జగన్
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: May 30, 2019 | 12:52 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విశ్వాసం, విధేయతతో కూడిన పాలనను అందిస్తానని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జగన్‌కు గవర్నర్ అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభా వేదికపై మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పీవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని  చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది.