నేను ‘బాహుబలి’ గ్రాఫిక్స్ చూపించలేను: జగన్
రాజధానిపై ఏపీ సీఎం జగన్ మరోసారి స్పష్టతను ఇచ్చారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన జగన్.. రాజధానిపై తాము బాహుబలి గ్రాఫిక్స్ చూపించనని అన్నారు. సింగపూర్, జపాన్ తరహా నగరాలను సృష్టించేంత నిధులు మన దగ్గర లేవని తెలుసు కాబట్టి.. లేనిపోనివి చూపించి జనాన్ని మభ్యపెట్టి, మోసం చేయలేనని జగన్ స్పష్టం చేశారు. తాను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలను మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టలేకే రాజధాని వికేంద్రీకరణ […]
రాజధానిపై ఏపీ సీఎం జగన్ మరోసారి స్పష్టతను ఇచ్చారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన జగన్.. రాజధానిపై తాము బాహుబలి గ్రాఫిక్స్ చూపించనని అన్నారు. సింగపూర్, జపాన్ తరహా నగరాలను సృష్టించేంత నిధులు మన దగ్గర లేవని తెలుసు కాబట్టి.. లేనిపోనివి చూపించి జనాన్ని మభ్యపెట్టి, మోసం చేయలేనని జగన్ స్పష్టం చేశారు. తాను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలను మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టలేకే రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే అభివృద్ధి చెందింది కాబట్టే రాజధానిని విశాఖకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1.09లక్షల కోట్లు కావాలని.. కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2కోట్లు అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు. ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం అవుతుందని.. దానికి చేసే ఖర్చుతో కనీసం పది శాతం విశాఖలో ఖర్చు చేస్తే, పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడుతుందని జగన్ వెల్లడించారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగుతుందని.. అలాగే విశాఖ ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్‌గా ఉంటుందని ఆయన మరోసారి రాజధానిపై క్లారిటీ ఇచ్చారు. సచివాలయం, సీఎం ఆఫీస్, మంత్రులు, హెచ్‌వోడీలు విశాఖలోనే ఉంటాయని జగన్ అన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలని తనకు లేదని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తు తరాలకు జవాబుదారీగా ఉండాలని తాను అనుకుంటున్నానని జగన్ చెప్పారు.