ఎక్కడివారు అక్కడే ఉండండి.. జగన్‌ విఙ్ఞప్తి

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎక్కడివారు అక్కడే ఉండాలిన ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి విఙ్ఞప్తి చేశారు. కరోనా నివారణపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రయాణాల వలన వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. రాష్ట్ర సరిహద్దుకు చేరుకుంటున్న వలస కూలీలకు సదుపాయాల కల్పన కష్టమవుతోందని అన్నారు. ఇందుకు మిగిలిన వారు సహకరించాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా కేంద్ర హోంశాఖ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:39 pm, Sun, 3 May 20
ఎక్కడివారు అక్కడే ఉండండి.. జగన్‌ విఙ్ఞప్తి

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎక్కడివారు అక్కడే ఉండాలిన ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి విఙ్ఞప్తి చేశారు. కరోనా నివారణపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రయాణాల వలన వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. రాష్ట్ర సరిహద్దుకు చేరుకుంటున్న వలస కూలీలకు సదుపాయాల కల్పన కష్టమవుతోందని అన్నారు. ఇందుకు మిగిలిన వారు సహకరించాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాగా కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర సరిహద్దు వరకు కూలీలకు అనుమతిని ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఇప్పటికే చాలామంది కూలీలు సరిహద్దుకు చేరుకోగా.. వారందరినీ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి పరీక్షలు చేయనున్నారు. మరోవైపు వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా నివారణ, సహాయ చర్యలపై నిత్యం సమీక్ష జరుపుతున్నామని.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటికి ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని.. అలాంటి ప్రాంతాల్లో నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచామని ఆళ్ల నాని వివరించారు.

Read This Story Also: ఆ తరువాత అడ్రసు లేకుండా పోతారు.. బాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు