కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు : అంబటి

చంద్రబాబు అధికారంలో ఉంటే వర్షాలుండవని.. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉంటే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడైనా ఇంతటి జలకళ చూడలేదన్నారు.. కృష్ణా నదికి వరద ప్రభావం అధికంగా ఉన్నందున ఆయన ఇంటికి ప్రమాదం ఏర్పడిందని, ఈ పరిస్థితిలో ఆయనకు నివాసం కావాలని కోరితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మరోవైపు ఈ వరదలకు వైసీపీ ప్రభుత్వమే కారణమనే […]

కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు : అంబటి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 17, 2019 | 7:12 PM

చంద్రబాబు అధికారంలో ఉంటే వర్షాలుండవని.. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉంటే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడైనా ఇంతటి జలకళ చూడలేదన్నారు.. కృష్ణా నదికి వరద ప్రభావం అధికంగా ఉన్నందున ఆయన ఇంటికి ప్రమాదం ఏర్పడిందని, ఈ పరిస్థితిలో ఆయనకు నివాసం కావాలని కోరితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.

మరోవైపు ఈ వరదలకు వైసీపీ ప్రభుత్వమే కారణమనే వ్యాఖ్యాలు చేస్తే ఇక చంద్రబాబును ఎవ్వరూ మార్చలేరన్నారు. అదేవిధంగా ఈ వరదలు మేన్ మేడ్ వరదలని ఆరోపించిన మాజీ మంత్రి దేవినేని ఉమపై కూడా అంబటి ఫైరయ్యారు. ఆల్మట్టి డ్యామ్, జూరాల వంటి ప్రాజక్టులన్నీ నిండిపోవడం మేన్ మేడ్ అంటారా అని ఎద్దేవా చేశారు.