బాబును ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు: బోండా ఉమ
చంద్రబాబును టార్గెట్ చేసుకొని వైసీపీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ మండిపడ్డారు.హైసెక్యూరిటీ జోన్‌లోకి డ్రోన్లు ఎలా వస్తాయని ప్రశ్నించిన బోండా.. డ్రోన్ కెమెరాలు వాడిన వారిపై కేసులు నమోదు చేస్తారా..? లేదా..? అని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్‌మెంట్ దొరకలేదని.. సాయంత్రం 4గంటలకు గుంటూరు ఐజీ కార్యాలయానికి వెళ్తానని తెలిపారు. చంద్రబాబును ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని చెప్పుకొచ్చారు. భారీ వరదలు వచ్చినా గతంలో ఫ్లడ్ మానిటరింగ్ […]
చంద్రబాబును టార్గెట్ చేసుకొని వైసీపీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ మండిపడ్డారు.హైసెక్యూరిటీ జోన్‌లోకి డ్రోన్లు ఎలా వస్తాయని ప్రశ్నించిన బోండా.. డ్రోన్ కెమెరాలు వాడిన వారిపై కేసులు నమోదు చేస్తారా..? లేదా..? అని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్‌మెంట్ దొరకలేదని.. సాయంత్రం 4గంటలకు గుంటూరు ఐజీ కార్యాలయానికి వెళ్తానని తెలిపారు. చంద్రబాబును ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని చెప్పుకొచ్చారు. భారీ వరదలు వచ్చినా గతంలో ఫ్లడ్ మానిటరింగ్ చేశారని.. గతంలో 12లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. లంక గ్రామాలు మునగలేదని గుర్తు చేశారు. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.