చంద్రబాబు నివాసం వద్ద మంత్రులకు షాక్.. అడ్డుకున్న సెక్యూరిటీ

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన వద్దకు వెళ్లిన మంత్రులు బొత్స, వెల్లంపల్లి, అనిల్‌లను సెక్యూరిటీ షాక్ ఇచ్చారు. మంత్రులు లోపలకు వెళ్లొద్దంటూ చెక్ పోస్ట్ వద్దే సెక్యురిటీ ఆపేశారు. మంత్రులను లోపలికి వదలొద్దని టీడీపీ నేతలు చెప్పారని సెక్యూరిటి సమాధానం చెప్పింది. దీంతో మంత్రులు అక్కడి నుంచి వెనక్కి తిరిగిరావాల్సి వచ్చింది. అనంతరం వారు మాట్లాడుతూ.. మంత్రులు ఈ విధంగా ఎలా అడ్డుకుంటారని, టీడీపీ వాళ్లు తప్పు చేస్తున్నారని ఆగ్రహం […]

చంద్రబాబు నివాసం వద్ద మంత్రులకు షాక్.. అడ్డుకున్న సెక్యూరిటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 16, 2019 | 8:57 PM

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన వద్దకు వెళ్లిన మంత్రులు బొత్స, వెల్లంపల్లి, అనిల్‌లను సెక్యూరిటీ షాక్ ఇచ్చారు. మంత్రులు లోపలకు వెళ్లొద్దంటూ చెక్ పోస్ట్ వద్దే సెక్యురిటీ ఆపేశారు. మంత్రులను లోపలికి వదలొద్దని టీడీపీ నేతలు చెప్పారని సెక్యూరిటి సమాధానం చెప్పింది. దీంతో మంత్రులు అక్కడి నుంచి వెనక్కి తిరిగిరావాల్సి వచ్చింది.

అనంతరం వారు మాట్లాడుతూ.. మంత్రులు ఈ విధంగా ఎలా అడ్డుకుంటారని, టీడీపీ వాళ్లు తప్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని అంచనా వేయడానికి తాము వచ్చామని తెలిపారు. కాగా మంత్రులు వచ్చే సమయంలో వారి రాకను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్, వర్ల రామయ్యలు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటిపై డ్రోన్లు వినియోగిస్తుండటంతో అక్కడ వివాదం మొదలైన విషయం తెలిసిందే.