కాసేపట్లో టీడీపీ శాసనసభా పక్ష భేటీ..

ఉదయం 9.30గంటలకు టీడీపీ శాసనసభా పక్ష సమావేశం కానుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. శాసనమండలి రద్దు, సెలెక్ట్ కమిటీ.. శాసనసభలో జరిగే పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. భేటీ అనంతరం.. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా.. ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఇవాళ జరిగే శాసనసభకు హాజరుకాకూదని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన సమావేశానికి పలువురు హాజరుకాకపోవడం.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే.. […]

  • Publish Date - 8:54 am, Mon, 27 January 20 Edited By:
కాసేపట్లో టీడీపీ శాసనసభా పక్ష భేటీ..

ఉదయం 9.30గంటలకు టీడీపీ శాసనసభా పక్ష సమావేశం కానుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. శాసనమండలి రద్దు, సెలెక్ట్ కమిటీ.. శాసనసభలో జరిగే పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. భేటీ అనంతరం.. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా.. ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఇవాళ జరిగే శాసనసభకు హాజరుకాకూదని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన సమావేశానికి పలువురు హాజరుకాకపోవడం.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఇదిలా ఉంటే.. అటు ఏపీ కేబినేట్ కూడా ఉదయం 9.30 గంటలకి భేటీ కానుంది. ఈ సమావేశంలో శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే భోగాపురం విమానాశ్రయం, బందరు పోర్టు పీపీపీపద్దతిలో ముందుకు వెళ్లే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. హౌస్ సైట్స్‌కు అవసరమైన భూ కేటాయింపులపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.