ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కీలక అధికారుల నియామకం వేగంగా సాగుతోంది. ఇప్పటికే డీజీపీగా గౌతం సవాంగ్ పేరు ఖరారు కాగా.. తాజాగా ఇంటలిజెన్స్ స్టీఫెన్ రవీంద్ర పేరును ఖరారు చేశారు. స్టీఫెన్ రవీంద్రకు సమర్ధుడైన అధికారిగా పేరుంది. అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్‌ను కట్టడి చేసినట్టుగా మంచి రివార్డు కూడా ఉంది. మాజీ ముఖమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వంలో సీఎం సెక్యూరిటీ చీఫ్‌గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రను మరోసారి కీలక స్థానంలో […]

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 27, 2019 | 11:57 AM

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కీలక అధికారుల నియామకం వేగంగా సాగుతోంది. ఇప్పటికే డీజీపీగా గౌతం సవాంగ్ పేరు ఖరారు కాగా.. తాజాగా ఇంటలిజెన్స్ స్టీఫెన్ రవీంద్ర పేరును ఖరారు చేశారు. స్టీఫెన్ రవీంద్రకు సమర్ధుడైన అధికారిగా పేరుంది. అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్‌ను కట్టడి చేసినట్టుగా మంచి రివార్డు కూడా ఉంది.

మాజీ ముఖమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వంలో సీఎం సెక్యూరిటీ చీఫ్‌గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రను మరోసారి కీలక స్థానంలో నియమించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్ర ఇంటలిజెన్స్ ప్రధాన అధికారిగా స్టీఫెన్ రవీంద్ర పేరును ఖారురు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్‌పై ఏపీకి పంపించాల్సిందిగా కాబోయే సీఎం జగన్ కోరారు. దీనిపై తెలంగాణ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడ వెళ్లాడానికి స్టీఫెన్ రవీంద్ర రెడీ అవుతున్నారు.