ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం డీజేపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవాంగ్‌ ప్రస్తుతం విజిలెన్స్‌ డీజీగా ఉన్నారు. ఏపీ సీఎం కార్యాలయంలో నలుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం […]

ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 31, 2019 | 9:35 AM

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం డీజేపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవాంగ్‌ ప్రస్తుతం విజిలెన్స్‌ డీజీగా ఉన్నారు.

ఏపీ సీఎం కార్యాలయంలో నలుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే మాజీ సీఎం దగ్గర పనిచేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శులు గిరిజా శంకర్, అడుసుమిల్లి రాజమౌళిలను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.