AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ మార్క్ నిర్ణయం: కాంట్రాక్టులు అన్నీ హైకోర్టు జడ్జీలు ఓకే అంటేనే

ఏపీ సీఎంగా ఎన్నికైన జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా పాలనా వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఆయన నడుం బిగించారు. అవినీతి జరిగిన ప్రాజెక్టుల కాంట్రాక్టులను వెంటనే రద్దు చేస్తామని ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని..పారదర్శకంగా కొత్త కాంట్రాక్టులు తీసుకొస్తానని ప్రకటించారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని..టెండర్ల విధానంలో నూతన మార్పులు ఉంటాయన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర తాను రెండు, […]

జగన్ మార్క్ నిర్ణయం: కాంట్రాక్టులు అన్నీ హైకోర్టు జడ్జీలు ఓకే అంటేనే
Ram Naramaneni
|

Updated on: May 30, 2019 | 2:04 PM

Share

ఏపీ సీఎంగా ఎన్నికైన జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా పాలనా వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఆయన నడుం బిగించారు. అవినీతి జరిగిన ప్రాజెక్టుల కాంట్రాక్టులను వెంటనే రద్దు చేస్తామని ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని..పారదర్శకంగా కొత్త కాంట్రాక్టులు తీసుకొస్తానని ప్రకటించారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని..టెండర్ల విధానంలో నూతన మార్పులు ఉంటాయన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర తాను రెండు, మూడు రోజుల్లో అపాయింట్ మెంట్ తీసుకుని..టెండర్ల విధానంలో హైకోర్టు జడ్జీ చేత..జ్యుడిషయల్ కమీషన్ వేయాలని కోరుతామన్నారు.

ప్రతి కాంట్రాక్ట్ టెండర్‌కు పోకముందూ..జ్యుడిషీయల్ కమిషన్ దగ్గరకు పంపిస్తామన్నారు. హైకోర్టు జడ్జీ సూచనలు చేసినా..మార్పులు చేసినా..అవన్నీ పొందుపరిచి..అనంతరం టెండర్లు పిలుస్తామని ప్రకటించారు జగన్. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనే విధంగా నిబంధనల్లో మార్పు చేస్తామని ప్రకటించారు. ప్రతి కాంట్రాక్టును జ్యుడిషియరీ కమిటీ ముందు పెడుతామన్నారు. కమిటీ ఆమోదించాకే టెండర్లకు వెళుతామన్నారు. ఆరు నెలల నుండి సంవత్సర కాలం ఇవ్వండి..రాష్ట్రంలో ప్రక్షాళన చేసి చూపిస్తానని సీఎం జగన్ హామి ఇచ్చారు.

Follow Us
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు..
తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు..
ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..!
ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..!
పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ముంచుకొస్తోన్న భారీ ప్రమాదం..?
పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ముంచుకొస్తోన్న భారీ ప్రమాదం..?
50 మంది పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం.. ఇది కదా అసలైన ఎఫెక్ట్..?
50 మంది పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం.. ఇది కదా అసలైన ఎఫెక్ట్..?