కోడెల.. చివరిగా ఎవరితో మాట్లాడారంటే..?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయేముందు చివరిసారిగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సుమతితో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా 20 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. కోడెల ఆత్మహత్య కేసులో ప్రత్యక్ష సాక్షులుగా కూతురు, భార్య, గన్‌మెన్, డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని విచారించారు. అయితే కోడెల కొడుకు శివరాంతో మాకు ఎలాంటి సంబంధం […]
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయేముందు చివరిసారిగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సుమతితో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా 20 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. కోడెల ఆత్మహత్య కేసులో ప్రత్యక్ష సాక్షులుగా కూతురు, భార్య, గన్‌మెన్, డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని విచారించారు. అయితే కోడెల కొడుకు శివరాంతో మాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే కేసును పరిష్కరిస్తామని పోలీసులు చెబుతున్నారు.