దేశంలోనే తొలిసారి..ఏపీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ ఇకపై న్యాయసమీక్ష తర్వాతే ముందుకు వెళ్లనున్నాయి. దీని కోసం హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివ శంకర్ రావు నియమితులైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ప్ర‌ధాన న్యామ‌మూర్తి సిఫార్సు మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జస్టిస్ శిశంకర్‌ రావు మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. రూ.100 కోట్లు పైగా ప‌నుల టెండ‌ర్లను జ్యుడిషియ‌ల్ న్యాయ సమీక్ష చేస్తారు. […]

దేశంలోనే తొలిసారి..ఏపీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం
Siva Sankara Rao to head Judicial Preview Committee
Follow us

|

Updated on: Sep 12, 2019 | 4:57 AM

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ ఇకపై న్యాయసమీక్ష తర్వాతే ముందుకు వెళ్లనున్నాయి. దీని కోసం హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివ శంకర్ రావు నియమితులైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ప్ర‌ధాన న్యామ‌మూర్తి సిఫార్సు మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జస్టిస్ శిశంకర్‌ రావు మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. రూ.100 కోట్లు పైగా ప‌నుల టెండ‌ర్లను జ్యుడిషియ‌ల్ న్యాయ సమీక్ష చేస్తారు. రివ్యూల అనంతరమే ప్రాజెక్టుల కాంట్రాక్టులను ప్రభుత్వం ఓకే చేస్తుంది.  గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లోనే జ్యుడిషియ‌ల్ ప్రివ్యూ ప్ర‌క్రియకు సంబంధించి చ‌ట్టం చేశారు.

దేశంలో మొట్టమొదటిసారిగా.. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధనానికి నాంది పలికింది.  గత టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను తమ వాళ్లకు కట్టబెట్టారని  జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే తాము జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తామన్నారు. మాట చెప్పినట్టుగానే మూడు నెలలలోపు న్యాయసమీక్షను అమలులోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రివ్యూ ప్రాసెస్ ప్రకారం ఇకపై ఏదైనా టెండర్ రూ.100 కోట్లు దాటితే.. జడ్జి టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతారు. అలాగే సాంకేతిక విభాగం నుంచి సలహాలు, సూచనలు, వివరాలు తీసుకోవచ్చు. టెండర్ల విషయంలో జడ్జి చేసే సిఫార్సులను సంబంధిత శాఖ కచ్చితంగా పాటించాలి. జడ్జి 8 రోజులు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. పలు సూచనలు, సలహాలు ఇస్తారు. మొత్తం ఈ విధానంలో 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదనను ఖాయం చేస్తారు. ఆ తర్వాతే బిడ్డింగ్‌ పారదర్శకంగా కాంట్రాక్టర్లకు దక్కుతుంది. ఈ విధానం కనక విజయవంతమైతే దేశంలో చాలా రాష్ట్రాలకు జగన్ సర్కార్ ఆదర్శం కానుంది. ఏది ఏమైనా తన మార్కు పాలనతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ మరోసారి ఆ పంథాను చాటుకున్నారు.

Justice Sivasankara Rao Leads Andhra Pradesh Judicial Preview Process For Govt Tenders

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో