‘స్పందన’పై మెజార్టీ ప్రజలు సంతృప్తి : సీఎం జగన్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం, వస్తున్న ఫలితాలపై సీఎం జగన్‌ సమీక్షించారు. సమస్యల పరిష్కారంపై బాధితులకు ఫోన్లు చేసి అభిప్రాయాలు స్వీకరించామని అధికారులకు తెలిపారు. సమస్యలు బాగా పరిష్కరించారని 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చని 41 శాతం మంది చెప్పినట్లు పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఎంపిక చేసుకున్న కొంత మంది అధికారులను పిలిపిస్తామని… వినతుల్లో భాగంగా వారు ఇచ్చిన సమాధానాలను వారికే చూపిస్తామని […]

'స్పందన'పై మెజార్టీ ప్రజలు సంతృప్తి : సీఎం జగన్
Hon’ble CM Sri YS.Jagan Mohan Reddy reviewed the Spandana program with SPs and collectors, along with other Government Officials.
Follow us

|

Updated on: Sep 12, 2019 | 2:31 AM

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం, వస్తున్న ఫలితాలపై సీఎం జగన్‌ సమీక్షించారు. సమస్యల పరిష్కారంపై బాధితులకు ఫోన్లు చేసి అభిప్రాయాలు స్వీకరించామని అధికారులకు తెలిపారు. సమస్యలు బాగా పరిష్కరించారని 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చని 41 శాతం మంది చెప్పినట్లు పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఎంపిక చేసుకున్న కొంత మంది అధికారులను పిలిపిస్తామని… వినతుల్లో భాగంగా వారు ఇచ్చిన సమాధానాలను వారికే చూపిస్తామని తెలిపారు. ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించి వర్క్‌షాపు నిర్వహిస్తామని ప్రకటించారు. వినతులు ఇచ్చే ప్రజల పట్ల కొందరు సిబ్బంది సవ్యంగా ప్రవర్తించడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయని.. అలాంటి కేసులు 2 శాతం నుంచి 5 శాతం వరకూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామన్న వాస్తవాన్ని క్షేత్రస్థాయి అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.

ప్రజలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చామని అధికారులతో ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మనం సేవకులమే కాని, పాలకులం కాదని వ్యాఖ్యానించారు. వినతులు, సమస్యలు నివేదించే వారి పట్ల చిరునవ్వుతో ఆహ్వానించాలని సూచించారు. స్పందన స్ఫూర్తి తగ్గకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం.. గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని మరిచిపోవద్దనన్నారు.