అమరావతిలో భారీ వర్షం
గత మూడు రోజులుగా మండుటెండల నుంచి ఏపీ రాజధాని వాసులకు కాస్త ఉపశమనం లభించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల తాకిడికి పలు చెట్లు నేలకొరిగాయి. మంగళగిరిలో ఎప్పుడూలేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఈ రోజు కురిసిన వర్షం అక్కడి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. అయితే మొదట చిరుజల్లులుగా మొదలైన వాన.. వడగండ్ల వానగా […]
గత మూడు రోజులుగా మండుటెండల నుంచి ఏపీ రాజధాని వాసులకు కాస్త ఉపశమనం లభించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల తాకిడికి పలు చెట్లు నేలకొరిగాయి. మంగళగిరిలో ఎప్పుడూలేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఈ రోజు కురిసిన వర్షం అక్కడి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది.
అయితే మొదట చిరుజల్లులుగా మొదలైన వాన.. వడగండ్ల వానగా మారింది. విజయవాడలోనూ భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తాడేపల్లి ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న భవనంపై భారీ హోర్డింగ్ కూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.