AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు భారీ గుడ్‌న్యూస్.. రైతు భరోసాపై ప్రభుత్వం మరో శుభవార్త.. ఈ సారి..

రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇప్పటివరకు విడతల వారీగా ప్రభుత్వం నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ ఈ సారి ఒకే విడతలో రైతులకు అందించనుందని తెలుస్తోంది. ఇప్పటికే నగదు జమ చేయడం ఆలస్యమైన క్రమంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు భారీ గుడ్‌న్యూస్.. రైతు భరోసాపై ప్రభుత్వం మరో శుభవార్త.. ఈ సారి..
Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Feb 15, 2026 | 7:31 AM

Share

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న రైతు భరోసాపై గుడ్‌న్యూస్ అందింది. ఎట్టకేలకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.ఈ నెల 17న రైతు భరోసా డబ్బలును విడుదల చేసింది. ఆ రోజున రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానున్నాయి. యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు అందించేందుకు సిద్దమయ్యారు. గతంలో విడతల వారీగా వీటిని జమ చేయగా… ఇందుకు తొమ్మిది రోజుల సమయం పట్టేది. అయితే ఇప్పుడు ఒకే విడతలో వీటిని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో రైతులు తమకు ఎప్పుడు పడతాయోనని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందరికీ ఒకేసారి నగుదును బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుందని తెలుస్తోంది. జనవరిలోనే ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగడంతో అధికారులు ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మన్సిపల్ ఎన్నికలు ముగియడయంతో రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం సిద్దమైంది.

రూ.9 వేల కోట్లు సిద్దం

యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా జమ చేసేందుకు రూ.9 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల విడుదలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. గత ఖరీఫ్ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు రైతు భరోసా విడుదల చేశారు. ఇందుకోసం రూ.8,744.13 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. రైతు భరోసా విడుదల చేయడంలో జాప్యం జరగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లోనే యాసంగి సీజన్ మొదలైనప్పటికీ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. దీంతో విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు రైతుల దగ్గర డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది బ్యాంకుల నుంచి అప్పులు, మరికొంతమంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే ఇందుకు అవసరమైన నిధులను ఆర్ధికశాఖ విడుదల చేసింది.

సీఎం రేవంత్ ప్రకటన

ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. నిధుల సర్దుబాటు, మున్నిపల్ ఎన్నికల వేళ అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు