Godavari Boat Accident : బోటు ప్రమాదంలో అత్యధికులు తెలంగాణ వాసులే

పాపికొండల యాత్రలో ఇదో ఘోర దుర్ఘటన.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన బోటు బోల్తా ప్రమాదం తెలుగురాష్ట్రాలను దిగ్భాంతికి గురిచేసింది. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు తెలంగాణకు చెందినవారిగా తెలుస్తోంది. పాపికొండల అందాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి 22 మంది, వరంగల్ నుంచి 15 మంది ఈ యాత్రకు బయలుదేరి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఎనిమిది మందిని ట్రాక్టర్‌లో దేవీపట్నానికి తరలించారు. అదేవిధంగా ప్రాణాలతో బయటపడ్డ […]

Godavari Boat Accident : బోటు ప్రమాదంలో అత్యధికులు తెలంగాణ వాసులే
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 15, 2019 | 6:35 PM

పాపికొండల యాత్రలో ఇదో ఘోర దుర్ఘటన.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన బోటు బోల్తా ప్రమాదం తెలుగురాష్ట్రాలను దిగ్భాంతికి గురిచేసింది. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు తెలంగాణకు చెందినవారిగా తెలుస్తోంది. పాపికొండల అందాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి 22 మంది, వరంగల్ నుంచి 15 మంది ఈ యాత్రకు బయలుదేరి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఎనిమిది మందిని ట్రాక్టర్‌లో దేవీపట్నానికి తరలించారు. అదేవిధంగా ప్రాణాలతో బయటపడ్డ క్షతగాత్రులకు వైద్య సహాయాన్నిఅందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పాపికొండల యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన గాంధీ, విశాల్, లక్ష్మణ్, జానకిరామ్,రాజేష్, రఘరామ్, అబ్దుల్ సలీమ్, సాయికుమార్, రఘురామ్, విష్ణుకుమార్, మహేశ్వరరెడ్డి కుటుంబం, వరంగల్‌కు చెందిన వరంగల్, విశాఖకు చెందిన రమణ, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన జగన్ గల్లంతయినట్టుగా తెలుస్తుంది.

ఆదివారం ఉదయం జరిగిన ఈ బోటు బోల్తా ప్రమాదంపై బోటు యజమాని వెంటకరమణ మాట్లాడుతూ కచలూరు వద్ద పెద్ద సుడిగుండం ఉందని, దాన్ని దాటే క్రమంలో డ్రైవర్లు సరిగా నడపలేకపోయారంటూ వివరణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజులు తమ ప్రాణాలు కోల్పోయారు.

ఇక ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలపై టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటుచేసింది. ప.గోదావరి, తూ.గోదావరి, విశాఖ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ప.గోదావరి జిల్లా 1800 233 1077, తూ.గోదావరి జిల్లా 1800 425 3077, విశాఖ జిల్లా 1800 4250 0002 నెంబర్లను అందుబాటులో ఉంచింది. బాధితుల కుటుంబ సభ్యులు ఎవరైనా అత్యవసర నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని అధికారులు తెలిపారు.