చంద్రబాబు హయాంలో పుస్తకాలు ఎందుకు రిలీజ్ చేయలేదు : అంబటి రాంబాబు

ఏపీ సీఎ జగన్ తన వంద రోజుల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19 చారిత్రాత్మక బిల్లులను ఆమోందించిందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ప్రభుత్వం చెయ్యలేని విధంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. తమ ప్రజా రంజకంగా సాగుతున్న తమ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంచి సర్టిఫికెట్ […]

చంద్రబాబు హయాంలో పుస్తకాలు ఎందుకు రిలీజ్ చేయలేదు : అంబటి రాంబాబు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2019 | 7:28 PM

ఏపీ సీఎ జగన్ తన వంద రోజుల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19 చారిత్రాత్మక బిల్లులను ఆమోందించిందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ప్రభుత్వం చెయ్యలేని విధంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. తమ ప్రజా రంజకంగా సాగుతున్న తమ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంచి సర్టిఫికెట్ ఇస్తారని తాము అనుకోవడం లేదంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేనలు పార్టీలు తాము అమలు చేస్తున్న మధ్యనిషేధంపై అవాస్తవాలను ప్రఛారంచేస్తున్నారని ఆరోపించారు. నిషేదంలో భాగంగా తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మధ్యం అమ్మకాలు 14% తగ్గాయన్నారు. తాము ప్రజాభిప్రాయమే ప్రామాణికంగా ప్రభుత్వ పాలన సాగిస్తున్నట్టుగా అంబటి చెప్పారు .

పవన్ కళ్యాణ్ నిజమైన పెయిడ్ ఆర్టిస్టు అంటూనే చంద్రబాబు అక్రమ ఇంటిలో నివాసం ఉంటే ఆ విషయంపై పవన్ ఎందుకు మాట్లాడరంటూ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ ఎందుకు పుస్తకాలు విడుదల చెయ్యలేదని అంబటి ప్రశ్నించారు. చిత్తశుద్దితో పారదర్శకవంతమైన పాలనను సీయం జగన్ పరిపాలన జరుగుతుందని, రాజధాని అమరావతికి సంబంధించి సుజన చౌదరి, లోకేష్, లింగమనేని రమేష్ లాంటి రైతులే ఆందోళన చెందుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.