Godavari Boat Accident: అది చాలా డేంజరస్ స్పాట్ః బోటు యజమాని
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 62 ప్రయాణికులతో ఉన్న పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ ఘటనపై బోటు యజమాని స్పందించాడు. తమ లాంచీ కెపాసిటీ 90 అని.. బోటులో 150 లైఫ్ జాకెట్లు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇక పడవ బోల్తా పడిన ప్రాంతం చాలా ప్రమాదకరమైనదని.. అక్కడ పెద్ద సుడిగుండం ఉండటంతో డ్రైవర్లు సరిగ్గా హ్యాండిల్ చేయకలేకపోయారని చెప్పాడు. అదే బోటు బోల్తా పడడానికి కారణం అయి ఉండొచ్చన్నాడు. అంతేకాకుండా […]

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 62 ప్రయాణికులతో ఉన్న పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ ఘటనపై బోటు యజమాని స్పందించాడు. తమ లాంచీ కెపాసిటీ 90 అని.. బోటులో 150 లైఫ్ జాకెట్లు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇక పడవ బోల్తా పడిన ప్రాంతం చాలా ప్రమాదకరమైనదని.. అక్కడ పెద్ద సుడిగుండం ఉండటంతో డ్రైవర్లు సరిగ్గా హ్యాండిల్ చేయకలేకపోయారని చెప్పాడు. అదే బోటు బోల్తా పడడానికి కారణం అయి ఉండొచ్చన్నాడు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి మరో పడవలో సహాయక బృందాలు వచ్చి కొందరిని రక్షించమని తెలిపాడు.




