రేపటి నుంచే ఎన్నికల ప్రచార పనులు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో కీలమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పారు. సర్వేలు, పార్టీలోని సమాచారం ప్రకారం సీఎం చంద్రబాబు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. అలాగే.. రేపటి నుంచే ఎన్నికల ప్రచార పనులు ప్రారంభిస్తామని తెలిపారాయన. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నా వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏపీలో జరిగిన […]

రేపటి నుంచే ఎన్నికల ప్రచార పనులు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:57 PM

సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో కీలమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పారు. సర్వేలు, పార్టీలోని సమాచారం ప్రకారం సీఎం చంద్రబాబు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. అలాగే.. రేపటి నుంచే ఎన్నికల ప్రచార పనులు ప్రారంభిస్తామని తెలిపారాయన. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నా వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏపీలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి తెలంగాణాలో కూడా జరగలేదన్నారు సోమిరెడ్డి. ఏపీ అమలు చేసిన వాటినే తెలంగాణ అమలు చేసి గొప్పగా చేశామని చెప్పుకుంటున్నారని అన్నారు. స్వార్థం కోసం పార్టీ మారే వారు ఎన్నికల్లోకి వచ్చినా ప్రజలు వాళ్లను పట్టించుకోరని అన్నారు. మధ్యాహ్నాం జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సోమిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, సునీత, సోమిరెడ్డి, గంటా శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.