అలా చేశారో కఠిన చర్యలు తప్పవు.. ఆసుపత్రులకు జగన్‌ హెచ్చరిక

కరోనా చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:44 pm, Tue, 25 August 20
అలా చేశారో కఠిన చర్యలు తప్పవు.. ఆసుపత్రులకు జగన్‌ హెచ్చరిక

YS Jagan warns Hospitals: కరోనా చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలని, అధిక రేట్లు వసూలు చేయొద్దని ఆయన అన్నారు. కొన్ని చోట్ల కరోనా రోగుల వద్ద నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ ఆసుపత్రులపై సీఎం ఫైర్ అయ్యారు.  స్పందన కార్యక్రమంపై సమీక్ష జరిపిన సీఎం అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే కరోనా రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేయకూడదని స్పష్టం చేశారు.  కరోనా ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, కరోనా బాధితుడికి అరగంట లోపు బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్‌లదేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్‌ కాల్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Read More:

సినిమా పాటలకు వచ్చే ఆదరణ మంచి వీడియోలకు రావు: ఏపీ సీఐడీ ఏడీజీ

నిన్ను చాలా మిస్ అవుతున్నాం: సుశాంత్‌పై రైనా ఎమోషనల్ వీడియో