సినిమా పాటలకు వచ్చే ఆదరణ మంచి వీడియోలకు రావు: ఏపీ సీఐడీ ఏడీజీ

సినిమా పాటలకు వచ్చిన ఆదరణ సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలకు కూడా రావాలని ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అన్నారు.

సినిమా పాటలకు వచ్చే ఆదరణ మంచి వీడియోలకు రావు: ఏపీ సీఐడీ ఏడీజీ
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2020 | 2:21 PM

AP CID ADG Sunil Kumar: సినిమా పాటలకు వచ్చిన ఆదరణ సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలకు కూడా రావాలని ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అన్నారు. ఈ మధ్య బాగా పాపులర్ అయిన నాది నక్కిలీసు గొలుసు పాటను 6 కోట్ల మంది చూశారని.. కానీ అందరికీ అవసరమైన ఈ రక్షా కార్యక్రమాన్ని మాత్రం నాలుగు లక్షల మంది చూశారని పేర్కొన్నారు. సైబర్ క్రైంపై అవగాహనా కార్యక్రమాలను కూడా అంతమంది చూడాలని ఆయన తెలిపారు. సినిమా పాటలు వినోదాన్ని ఇచ్చేవని.. అవి చూసినా, చూడకపోయినా పెద్ద నష్టమేమి రాదని.. కానీ సైబర్ సేఫ్టీ కార్యక్రమాలను చూడకపోతే నిజజీవితంలో నష్టపోతారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటి బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలను చూడాలని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రతి పౌరుడిని సైబర్ సైనికుడిగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా సునీల్ కుమార్ వెల్లడించారు.

Read More:

నిన్ను చాలా మిస్ అవుతున్నాం: సుశాంత్‌పై రైనా ఎమోషనల్ వీడియో

షాకింగ్‌: రెండోసారి సోకిన కరోనా.. హాంకాంగ్‌లో తొలి కేసు నమోదు