AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Boy Missing: బ్రేకింగ్ : గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రైన్ లో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ లభ్యం

నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. ఈ వర్ష బీభత్సానికి పీకల వాగు కూడా పొంగిపొర్లింది. ఈ క్రమంలో శివరాం నగర్ లో నివసించే..

Guntur Boy Missing:  బ్రేకింగ్ : గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రైన్ లో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ లభ్యం
Boy Swept Away
Venkata Narayana
|

Updated on: Jun 27, 2021 | 10:08 AM

Share

Guntur : గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. ఈ వర్ష బీభత్సానికి పీకల వాగు కూడా పొంగిపొర్లింది. ఈ క్రమంలో శివరాం నగర్ లో నివసించే పుల్లయ్య, మంగమ్మల రెండో కొడుకు కాలువ ఒడ్డున ఆడుకుంటూ పీకలవాగు డ్రెయిన్ లో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన వెంకటేష్ అన్నయ్య తల్లి దండ్రులకు చెప్పాడు.

అయితే, డ్రెయిన్ వేగంగా ప్రవహిస్తుండటంతో అప్పటికే బాలుడు డ్రైన్ లో కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకి కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. నగర మేయర్ కావటి మనోహర్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన నిన్న సాయంత్రం ఐదుగంటల సమయంలో జరిగినప్పటికీ ఇప్పటి వరకూ బాలుడు జాడ తెలియరాలేదు. మరోవైపు, బాలుడి తల్లిదండ్రులు చిన్నారి కోసం కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇప్పుడే అందిన వార్త :

గుంటూరు పీకలవాగు లో గల్లంతైన బాలుడు ఆచూకి లభ్యమైంది. సంపత్ నగర్ సమీపంలో బాలుడు మృత దేహం కనిపించింది. గత రాత్రి మెడికల్ క్లబ్ వద్ద పీకలవాగు లో పడి ఐదేళ్ల బాలుడు వెంకటేష్ గల్లంతైన సంగతి తెలిసిందే. ఎన్డిఆర్ఎఫ్ , మున్సిపల్ సిబ్బంది తో రాత్రంతా గాలింపు చేపట్టగా ఈ ఉదయం బాలుడు వెంకటేష్ శవమై కనిపించాడు.

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు.. ముగ్గురు మృతి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కురులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. నీటిలో మునిగిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మృతులంతా బిచ్కుంద మండలం చెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ గుంత దాటుతుండగా.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

మృతులు బీర్కూర్ నుంచి బిచ్కుంద మండటంతోని చెట్లూరు వెళ్తూ.. మంజీరా నది దాటుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. నీటి ప్రవాహం అధికంగా ఉండటం, దీంతోపాటు గుంతలు ఉండటంతో వారు నీటిలో మునిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరూ మూడు మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

Read also : YS Sharmila : మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు.. ఖబడ్దార్ : వైయస్ షర్మిల

వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు