తొలిసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బొత్స

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వ్యవసాయ బడ్జెను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4వేల కోట్లకు […]

తొలిసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బొత్స
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 12, 2019 | 3:09 PM

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వ్యవసాయ బడ్జెను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4వేల కోట్లకు పైగా కేటాయింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

రైతులకు దీర్ఘకాలంగా మేలు చేసేలా ముందుకు సాగుతున్నామని, రైతుల సంక్షేమానికి అంకితమవుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘‘ సుదీర్ఘ పాదయాత్రలో సీఎం జగన్‌ రైతుల కష్టాలు చూసి చలించారు. మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావించి అమలు చేస్తాం. కౌలు రైతులకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.విపత్తులు వచ్చినప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నాం. ప్రభుత్వ రాయితీలు అందించడంలో  ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది’’ అని బొత్స అన్నారు.

మొత్తం రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు మంత్రి బొత్స వివరించారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ.27,946.65 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.919.58 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.

 • రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌
 • రెవెన్యూ వ్యయం-రూ.27,946 కోట్లు
 • పెట్టుబడి వ్యయం- రూ.919 కోట్లు
 • వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం- రూ.8750 కోట్లు
 • వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా- రూ.1163 కోట్లు
 • వడ్డీ లేని రుణాల కోసం- రూ.100 కోట్లు
 • వైఎస్‌ఆర్‌ రైతు బీమాకు- రూ.100 కోట్లు
 • ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు
 • వ్యవసాయ యాంత్రీకరణకు రూ.460 కోట్లు
 • ప్రకృతి వ్యవయసాయానికి రూ.91 కోట్లు
 • రైతు సంక్షేమం- వ్యవసాయ విభాగ అభివృద్ధికి రూ.12,280 కోట్లు
 • ఎన్‌జీరంగా వర్సిటీకి రూ.355 కోట్లు
 • పశుసంవర్థకశాఖకు రూ.1240 కోట్లు
 • పాల సేకరణ కేంద్రాలకు రూ.100 కోట్లు
 • పశు నష్టపరిహారం పథకానికి రూ.50 కోట్లు
 • 2 పశు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం రూ.75 కోట్లు
 • పౌల్ట్రీ రంగానికి రూ.50 కోట్లు
 • ఎస్వీ పశు వైద్య విద్యాలయం రూ.87 కోట్లు
 • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 100 కోట్లు
 • ఉద్యానవనశాఖ- రూ.1532 కోట్లు
 • ఉద్యాన వర్సిటీకి రూ.63 కోట్లు
 • పట్టు పరిశ్రమకు రూ.158 కోట్లు
 • ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ- రూ.70 కోట్లు
 • మత్స్యశాఖ అభివృద్ధికి రూ.409 కోట్లు
 • మార్కెటింగ్‌శాఖకు రూ.3,012 కోట్లు
 • 9గంటల ఉచిత విద్యుత్‌కు రూ.4525 కోట్లు
 • వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం-రూ.3,626 కోట్లు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu