AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లవకుశ’ కథ వివాదం.. టీటీడీపై విమర్శలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ సప్తగిరి మాస పత్రికలో ప్రచురితమైన రామాయణంలోని లవకుశ కథ ఇప్పుడు వివాదంగా మారింది.

'లవకుశ' కథ వివాదం.. టీటీడీపై విమర్శలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 3:20 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ సప్తగిరి మాస పత్రికలో ప్రచురితమైన రామాయణంలోని లవకుశ కథ ఇప్పుడు వివాదంగా మారింది. అందులో సీతకు లవుడు మాత్రమే కుమారుడని, కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ ప్రచురించారు. ఈ కథను తిరుపతికి చెందిన ఓ బాలుడు రాసినట్లు తెలుస్తుండగా.. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. సప్తగిరి పత్రిక ఎడిటర్ రాధా రమణ, ఎడిటర్, సబ్ ఎడిటర్‌లను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.

ఇక ఈ వివాదంపై టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ గ్రంధం ప్రాతిపదికన దీన్ని ప్రచురించారో తెలపాలని అన్నారు. టీటీడీ వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన వివరించారు. ఎడిటర్ రాధా రమణను తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ వెబ్‌సైట్‌లో వివాదాస్పద లవకుశుడి కథనాన్ని తొలగించారు. అలాగే ముద్రించిన పుస్తకాలను ప్రిటింగ్ ప్రెస్ నుంచి భక్తులకు పంపిణీ చేయకుండా నిలుపుదల చేశారు. అయితే ఇటీవల టీటీడీ భూముల వేలంపై కూడా పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. టీటీడీకి సంబంధించిన భూములను అమ్మేందుకు సంస్థ సిద్దమవ్వగా.. ఆ భూములను అమ్మొద్దంటూ పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో భూములు అమ్మడం లేదంటూ అటు ఏపీ ప్రభుత్వం, ఇటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతను ఇచ్చారు.

Read This Story Also: వాజీద్ ఖాన్ తల్లికి కరోనా.. ఆమె ద్వారానే అతడికి సోకిందా..!

అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!